అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన నదియాకు చిరంజీవితో నటించే చాన్స్ ఎలా మిస్ అయిందో తెలుసా.?!

మెగాస్టార్ చిరంజీవి తో కైకాల సత్యనారాయణ ఆయన తమ్ముడు కైకాల నాగేశ్వరరావు కలిసి చిరంజీవి అనే సినిమా నిర్మించడం జరిగింది. ఆ సినిమా పరాజయంతో కైకాల సత్యనారాయణ హీరో చిరంజీవి డేట్స్ ఇచ్చినా కూడా వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయామని బాధ పడ్డారు. ఆ క్రమంలో చిరంజీవి పర్వాలేదు మళ్లీ మన కాంబినేషన్ లో మరో సినిమా తీద్దాం అనుకున్నారు. అలా చాలా రోజుల అనంతరం కైకాల నాగేశ్వరరావు చిరంజీవితో 1989లో ఒక సినిమా చేద్దామనుకున్నారు.

అది ఇంతకు ముందు లాంటి సాధారణ సినిమా కాకుండా చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. నిర్మాత నాగేశ్వరరావు హాలీవుడ్ లో కౌ బాయ్ సినిమాలను కొన్ని చూసి అందులో 10 రకాలైన చిత్రాలను చూడమని సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, విజయేంద్రప్రసాద్, శివ శక్తి దత్త లాంటి రచయితలకు చెప్పడం జరిగింది. అలా వారు కౌబాయ్ చిత్రాల ఆధారంగా ఒక అద్భుతమైన కథను రూపొందించడం జరిగింది. కైకాల నాగేశ్వరరావు తను చిరంజీవితో తీయబోయే చిత్రానికి తన స్నేహితుడైన మురళీ మనోహర్ రావును దర్శకుడిగా ఎంచుకున్నారు. అలా వారిద్దరూ చిరంజీవిని కలిసి మీతో ఒక కౌబాయ్ చిత్రాన్ని చేయాలనుకుంటున్నామని చెప్పడంతో చిరంజీవి గారు నాకు ఓకే… కానీ బడ్జెట్ చాలా అవుతుందని సలహా చెప్పడం జరిగింది. అయినా నాగేశ్వరరావు బడ్జెట్ విషయంలో వెనుకకు రాలేదు. కొదమ సింహం చిత్రానికి దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది.

అయితే కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు తో కౌబాయ్ చిత్రాలు మొదలు కావడం జరిగింది. ఆ తర్వాత అర్జున్, సుమన్, భానుచందర్ లాంటివాళ్ళు కౌబాయ్ చిత్రాలు తీసినప్పటికీ అవి మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రీచ్ కాలేకపోయాయి. 1989లో కొదమసింహం షూటింగ్ జరిగే ముందు ఆ చిత్రానికి భారీ తారాగణాన్ని ఎంపిక చేయడం జరిగింది. బాలీవుడ్ లో ప్రముఖ యాక్టరైన ప్రాన్, అదేవిధంగా ఓ ప్రత్యేక పాత్రలో మోహన్ బాబు నటించగా, కన్నడ ప్రభాకర్, రంగనాథ్ ఇతర పాత్రల్లో తెరపై కనిపించారు. హీరోయిన్ల విషయానికొస్తే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయడం జరిగింది.అందులో రాధా, వాణి విశ్వనాథ్, మూడవ హీరోయిన్ గా నదియా ను అనుకున్నారు. కానీ ఆమెకు అప్పటికే పెళ్ళి అయిపోయి అమెరికాలో స్థిరపడింది. ఐనా చిరంజీవితో నటించే అవకాశం నదియాకు రావడంతో ఆమె కొదమసింహం సినిమాలో నటిస్తానని డేట్స్ ఇవ్వడం జరిగింది. అవి చిరంజీవి డేట్స్ కి మ్యాచ్ కాకపోవడంతో ఆ పాత్ర సోనమ్ కి వెళ్లడం జరిగింది. 1990 ఆగస్టు 9న కొదమసింహం విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచిపోయింది.