Naga Chaithanya : బాలయ్య ఇంటి అల్లుడు అవ్వాల్సిన నాగచైతన్య… అందుకే పెళ్లి కాన్సల్ అయ్యిందా..?

Naga Chaithanya : నాగ చైతన్య, సమంత ఇద్దరిలో ఎవరి పేర్లు విన్నా అభిమానులలో మొదట గుర్తొచ్చేది వారి ఎన్నో ఏళ్ళ ప్రేమ, పెళ్లి, విడాకులు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ప్రారంభం అయిన వీరి పరిచయం తరువాత ప్రేమగా మారి వివాహ బంధంతో ఒకటి అయ్యారు. అయితే అయిదేళ్ళకే ఈ జంట వివాహ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవడం అభిమానులను కలచి వేసింది. అయితే విడాకుల తరువాత ఈ జంట మాత్రం వారి వారి కెరీర్ లో బాగానే రాణిస్తున్నారు. అభిమానులు మాత్రం వీళ్ళు మళ్ళీ కలుస్తారు అన్న ఆశలు వదిలేసుకున్నారు. అయితే నాగ చైతన్య, సమంతతో వివాహం చేసుకోక పోతే ఎవరిని చేసుకొనే వారు అన్న చర్చలు వస్తున్నాయి.

నందమూరి అల్లుడు కావాల్సిన చైతూ…

నందమూరి, అక్కినేని కుటుంబాలకు ఎప్పటినుండో మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనే ఆలోచన వచ్చినట్లు, అందుకు బాలకృష్ణ నాగార్జున కూడా ఆసక్తి కనబరచినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయానికి నాగ చైతన్య తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడం జరిగిందట.

నాగచైతన్య, సమంత ప్రేమ వ్యవహారం తెర మీదకు రావడంతో ఆ నిర్ణయంపై ఇరు కుటుంబాలు వెనక్కి తగ్గాయాని ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అదే నిజం అయ్యి ఉంటే ఇపుడు నాగ చైతన్య బాలయ్య అల్లుడు అయ్యేవాడు. నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య బంధుత్వాలు వచ్చేవని అనుకుంటున్నారు.