ఎమ్మెల్యే రోజాకు తప్పిన ప్రమాదం.. గాల్లోనే గంటపాటు తిరిగిన విమానం.. చివరకు ఏమైందంటే?

నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

అయితే పైలట్ విమానాన్ని తిరుపతిలో కాకుండా బెంగళూరులో సురక్షితంగా దించారు. ఎమ్మెల్యే రోజా రాజమండ్రి నుంచి తిరుపతికి వెళ్లాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం 10:55 గంటలకు తిరుపతి చేరుకోవాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఆమె ఎక్కారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వేగంగా స్పందించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానంలో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉండగా, విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తాము ఇంకా విమానంలోనే ఉన్నామని, ఇంకా విమానం తలుపులు తెరవలేదని ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పైలట్‌కు ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా వీడియో విడుదల చేశారు. తిరుపతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడంతో విమానం గంటకు పైగా గాలిలో తిరుగుతోందని ఆమె వీడియో ద్వారా వార్తను పంచుకున్నారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. మరోవైపు ఈ విమానం తిరుపతికి తిరిగి వస్తుందా లేదా అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే తో పాటు ఇతర ప్రయాణీకులు ఇప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి దిగడానికి అనుమతించారని .. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. తమకు ల్యాండింగ్‌కు అనుమతి లేనందున విమానం దిగేందుకు రూ. 5,000 చెల్లించాలని ఇండిగో అధికారులు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఊపిరాడక విమానంలో కూర్చోలేక ఆమెతో సహా కొందరు డబ్బులు చెల్లించారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫిర్యాదు చేయాలని చెప్పారన్నారు. ఆమెతో పాటు మిగిలిన ప్రయాణికులు ఈ వ్యవహారంపై సివిల్ కేసు నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.