రానా దగ్గుబాటి తన వారసత్వంతో కాకుండా నటనతో అభిమానులను సంపాదించకున్నాడు. హిందీ, తెలుగు, తమిళం అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల అభిమానులను అలరిస్తున్నారు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రానా. అయితే నేడు ఆయన పుట్టిన రోజు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లీడర్ తో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచమయ్యాడు రానా. ఆ సినిమాలో మంచి నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నాడు.
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే విలన్ పాత్రలకు కూడా వెనకాడటం లేదు రానా.. రాజమౌళి రూపొందించిన బహుబలిలో హీరో ప్రభాస్ కు ధీటుగా యాక్టింగ్ చేశాడు. దీంతోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో అతడి నటనకు ఎంతో మంది విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఏ క్యారెక్టర్ అయినా సులువుగా చేసే సత్తా తనలో ఉందంటూ నిరూపించాడు. తమిళంలో బెంగుళూర్ డేస్ ను రీమేక్ తో ఆయన నటించాడు.
తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన ఆరంభం మూవీలో మంచి క్యారెక్టర్ చేశాడు. తాజాగా పవర్ స్టార్ తో చేసిన భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వంలో లీడ్ రోల్ చేస్తున్నాడు రానా. ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో విలక్షణ పాత్ర చేస్తున్నాడు. తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్ ఉద్యమాల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు, వీడియోలు అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ రానా పుట్టిన రోజు సందర్భంగా ‘విరాట పర్వం’ చిత్రబృందం ‘వాయిస్ ఆఫ్ రవన్న’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఇది ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సినిమాతారలు, అభిమానులు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో పాటు బండ్ల గణేష్, దర్శకుడు బాబీ, హీరోయిన్ అనుష్క శెట్టి, సురేష్ ప్రొడక్షన్స్ రానాకు సోషల్ మీడియాద్వారా విషెస్ తెలుపుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…