కరోనా మహమ్మారి తగ్గినట్లే చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. రెండు వేవ్ లల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజానికం.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మహమ్మారి సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. ఎస్పీ బాలులాంటి లెజెండ్స్ ను మనకు కాకుండా కూడా చేసింది ఈ మాయదారి వైరస్.
కొన్ని రోజుల క్రితం డ్యాన్స్ మాస్టార్ శివశంకర్ కు కరోనా సోకి.. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ ఎక్కువ కావడంతో చనిపోయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఇలా వరుసగా సెలబ్రిటీలను కరోనా వదిలిపెట్టడం లేదు.
ఈ క్రమంలో తాజాగా మరో నటుడు కరోనా బారిన పడ్డారు. యాక్షన్ కింగ్ అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.. గత కొద్దిరోజుల ముందు నన్ను కలిసిన వారందరు దయచేసి కరోనా టెస్ట్ చేయింకోవాలని కోరుతున్నా.. నేను బాగానే ఉన్నా అందరు జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. రామ భక్తహనుమాన్ కి జై’’ అంటూ రాసుకొచ్చారు అర్జున్.
తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే తెలియజేస్తానని అతడు వెల్లడించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నాడు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. దయచేసి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…