బాలీవుడ్ నటి, సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. చిన్న తనంలోనే ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు. టీనేజ్ వయస్సులో పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ కుర్రకారుకు తన అందాలతో మత్తెక్కించింది. ఆ మధ్య కాలంలో ఆమె పలువురు కుర్రాళ్తో డేటింగ్ లో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలా జాన్వీ కపూర్ ఏదో ఒక కారణంతో వార్తలో నిలుస్తూ వస్తున్నారు.
మొదటిసారిగా ఆమె ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. నటనలో తన తల్లిని మించిపోయిందనే పేరు సంపాదించారు. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇలా ఆరంభంలోనే తనదైనశైలిలో నటించి.. అభిమానులను సంపాదించింది. ఇలా ఆమె అతి తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ..అందం.. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ఇటీవల ఆమె రూహీ అనే చిత్రంలో నటించింది.. కానీ ఇది ఆమెకు నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.
అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా.. ఆమె విమానాశ్రయం నుంచి కిందకు వస్తూ.. అక్కడే ఉన్న కెమెరాలకు చిక్కింది. అక్కడ ఆమె చేతికి గాయం అయి.. కట్టుతో కనిపించింది జాన్వీ. ఇది చూసిన ఫొటో గ్రాఫర్లు ఆమెను ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయింది.
దీంతో జాన్వీ ఇలా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్లడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు నెటిజన్లు. ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం సరైంది కాదంటూ.. ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా ఆమె ట్రోల్స్ కు గురికావడం మొదటి సారి కాదు.. గతంలో కూడా ఆనేక సార్లు ఆమె ఇలా ట్రోల్స్ కు గురైంది. ఒకానొక సమయంలో తన స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు ఫొటోలకు ఫోజివ్వమని అడిగితే.. ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయింది.
అప్పుడు కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇక ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’ మరియు ‘దోస్తానా 2’. ఈ రెండు చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…