Nayanatara: ఆస్తులు మొత్తం తన పేరు పైకి రాయించుకున్న నయనతార.. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా 20 సంవత్సరాల నుంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకొని సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ గా నయనతార పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే నయనతార తన భర్తను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విడాకుల దిశగా అడుగులు..
ఇదిలా ఉండగా తాజాగా నయనతార తన భర్త పేరుపై ఉన్నటువంటి ఆస్తులను మొత్తం తిరిగి తన పేరు మీద రాయించుకుందని తెలుస్తుంది. తన భర్త తన సర్వస్వం అంటూ ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం తన భర్త పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేశారట అయితే ఉన్నఫలంగా ఈమె ఆస్తులు అన్నింటిని కూడా తన పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నాయా వీరు కూడా విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారా వీరి జీవితంలో వేణు స్వామి చెప్పినది నిజం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.