AP: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన… వర్మకు మరో షాక్!

AP: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు టిడిపిలోకి వెళ్లడంతో వారిపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలోనే రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 12వ తేదీలోగా ఈ ఎన్నికలు పూర్తి కానున్నాయి. అయితే ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉన్నారు కనుక తప్పకుండా ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టిడిపి గెలుస్తుందని అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇస్తారు అని అందరూ భావించారు ముఖ్యంగా పార్టీ కోసం తమ సీట్లను త్యాగాలు చేసిన వారికే ఇస్తారని భావించినప్పటికీ రెండు సీట్లలో ఒకటి జనసేన మరొకటి టిడిపి వారికి ఇవ్వటం గమనార్హం. వైసీపీ నుంచి సి రామచంద్రయ్య ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉంటూ టిడిపికి రావడంతో ఆయనపై అనర్హత వేటు పడింది దీనితో తిరిగి చంద్రబాబు నాయుడు టిడిపి తరఫున ఆయనకే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.

ఇక జనసేన పార్టీ తరఫున పిడుగు హరిప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పనిసరిగా పిఠాపురం వర్మకు ఛాన్స్ ఉంటుందని అందరూ భావించారు. ఈయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్సీ ద్వారా మినిస్ట్రీ కూడా ఇవ్వబోతున్నారని భావించారు.

వర్మకు మరోసారి చేదు అనుభవం..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి ఎంతగానో దోహదం చేసిన వర్మకు పవన్ కూడా ఈ విధంగా సహాయం చేస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో భాగంగా వర్మకు ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడంతో కొంతమేర పిఠాపురం టిడిపి నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.