Shyamala: సినీనటి బుల్లితెర యాంకర్ శ్యామల చాలా రోజుల తర్వాత మొదటిసారి బయటకు వచ్చారు. ఈమె గత ఎన్నికలలో భాగంగా వైసిపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలు చేయడమే కాకుండా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్యామల ఇక ఇండస్ట్రీలో తన కెరియర్ మర్చిపోవాల్సిందేనని అందరూ భావించారు. ఈమె కూడా తనకు చాలా భయం వేస్తుందని కొంతమంది బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కూడా భారీగా ట్రోల్స్ చేస్తున్నారని ఒక వీడియోని విడుదల చేశారు. ఇలా ఎన్నికల ఫలితాలు తర్వాత ఇప్పటివరకు ఇంటిపట్టునే ఉన్న ఈమె మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమికి కల కారణాలు ఏంటి అనే విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా కావాలని ఈ ఫలితాల తర్వాత స్పష్టంగా అర్థమైందని తెలిపారు. అభివృద్ధి గురించి మా పార్టీ ఆలోచించకపోవడం వల్లే ఓటమిపాలైందని తెలిపారు. చేసిన తప్పుల్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని చెప్పుకొచ్చింది.
మెగా ఫ్యామిలీ ఆధిపత్యం..
తాను ప్రచారం చేసిన ప్రతీ చోటా.. వైకాపా గాలి కనిపించిందని, అయితే అది ఓట్ల రూపంలో తర్జుమా అవ్వలేదని విశ్లేషించింది. ఇక ఇప్పటికే తనకు కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు పూర్తిగా దూరం పెట్టారన్నమాట వాస్తవమైనని తెలిపారు. అయితే నేను ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు యాంకర్ గా చేస్తున్నాను. సినిమాల్లో ఓ ఫ్యామిలీ ఆధిపత్యం ఎక్కువ. వాళ్లు నన్ను పక్కన పెడతారా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలేం ఇటీవల జరగలేదు. కాబట్టి వాళ్ల స్పందన గురించి ఇప్పుడే చెప్పలేను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…