ఔషదగుణాలున్న వేపకు పెరుగును కలిపితే.. దాని ఫలితం ఎంతో అద్భుతం..!

వేపచెట్టు అనేది ప్రతీ సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. దీనిలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. వేప యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ సెఫ్టిక్.. ఇంకా చెప్పాలంటే ట్యూమర్, అల్సర్, మలేరియా, ఆక్సిడెంట్ లను నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మరక్షణకు, వెంట్రులకు ఆరోగ్యంగా ఉంచటానికి ఉపయోగపడుతుంది.

ఇక సహజంగా మన ఇళ్లలో ధాన్యం నిల్వచేసేందుకు, పొలాలలో ఎరువుగా కూడా వేప ఆకులను వాడతారు. అయితే ఇంతటి ఉపయోగాలు ఉన్న వేపకు పెరుగును వారానికి 3 లేదా 4 సార్లు కలపడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. రెండు చెంచాలు వేప ఆకులను పేస్ట్ చేసి..పెరుగుతో కలిపి ఉంచాలి. దీనిని చర్మానికి పట్టించినట్లయితే చర్మం కొద్ది సమయం తర్వాత దగదగమెరిసిపోతూ ఉంటుంది. వేప -పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మం దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేస్తుంది. ఇది చర్మశుద్ధిని పెంచుతుంది.

మొటిమలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. బ్లాక్ హెడ్స్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. దీనిని గాయం మీద అప్లై చేయడం ద్వారా, అది నయమవుతుంది అలాగే, మచ్చ కూడాపోతుంది. వేప – పెరుగు ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా డార్క్ సర్కిల్స్ కూడా తొలగిపోతాయి. ఎక్కువగా ఇది చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

అందుకే పెద్దోళ్లు మనకు తెలియకుండానే ఇంటి ముందు వేప చెట్టు పెంచుతారు. వేపచెట్టు నుంచి వచ్చే గాలి చెడు బ్యాక్టీరియాను దరిచేరనీయదు. చుట్టూ వాతావరణాన్ని చల్లగా ఉంచుతుంది. ఈ చెట్టు నీడలో పడుకుంటే ఆక్సిజన్ బాగా అందుతుంది. అందుకే పూర్వకాలంలో ఆరుబయట వేప చెట్టుకింద పడుకోవడం అలవాటుగా ఉండేది.