ఆ స్వర్ణం వెనుక ఎన్నో అవమానాలు.. వాటిని భరిస్తూ బంగారు పతకం వైపు పరుగు పెట్టాడు ‘నీరజ్ చోప్రా’..

విజయం సాధించిన ప్రతి సాధకుడి వెనుక ఏదో చిన్న పాటి కష్టం దాగి ఉంటుంది. ఇలాంటిదే భారతదేశం గర్వంగా చెప్పుకునే విధంగా టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) భారత అథ్లెట్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్వర్ణం (Gold Medal) సాధించాడు. దీంతో భారత్ లో ఏ రాష్ర్టంలో చూసినా ఆనందోత్సవాల మధ్య ప్రజలు సంబురాలు చేసుకున్నారు. అయితే ఇంత విజయం సాధించి భారత్ కు స్వర్ణం సాధించి ఆ ‘బంగారు’ చోప్రా ఒకప్పుడు ఇలా.. కండలు తిరిగి ఓ బాలివుడ్ హీరోలా ఉండేవాడు కాదు.

తోటి స్నేహితులు తన రూపాన్ని చూసి ఆటపట్టించేవారంట. అతడు 10 ఏళ్ల వయస్సులో ఎంతో ఉబకాయంతో బాధపడేవాడంట. వయస్సుకు మించిన వయస్సు ఉంటే ఎవరికైనా చూడటానికి మంచిగా అనిపించదు. ఇలా లావు ఎక్కువగా ఉండటంతో స్నేహితులు, బంధువుల వద్ద మాటలు పడ్డాడు. ఏదైనా ఒక రోజు కుర్తా-పైజామా వేసుకొని వెళ్తే.. అరెవో సర్పంచ్… అని ఆట పట్టించే వాళ్లు. సర్పంచ్ అంటే ముసలోడా అని వ్యంగ్యంగా అన్నట్లు అన్నమాట. ఇలా ఎన్నో అవమానాలు భరించేవాడు.
ఇలాంటి అవమానాలే అతడికి కసిని పెంచాయి. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.

పానిపట్‌కు సమీపంలోని ఖాంద్ర అనే గ్రామంలో నీరజ్ కుటుంబం నివసించేది. బరువు తగ్గించేందుకు వాళ్ల తల్లిదండ్రులు పానిపట్ స్టేడియంకు తీసుకొని వచ్చి పరుగెత్తించేవారు. నీరజ్ అక్కడ ట్రాక్‌పై పరుగులు పెడుతూనే.. జావెలిన్ త్రో చేసే వాళ్లను చూశాడు. ఈటెను కసిగా దూరంగా విసరడం అతడికి ఎందుకో నచ్చింది. అలా తొలి సారి జావెలిన్ పట్టుకున్న నీరజ్.. దాన్నే లోకంగా చేసుకున్నాడు. ఇలా బరువును తగ్గించుకోవడానికి వెళ్లిన చోప్రా.. అథ్లెట్‌గా మారిపోయాడు. ఇలా శిక్షణ తీసుకొని చిన్న చిన్న లెవల్లో ఆడి పతకాలను నెగ్గాడు.

2015 సంవత్సరంలోనే అతడు 80 మీటర్లు మార్కును దాటాడు. ఇంకా ఎక్కువ దూరం విసరాలనే మెరగైన శిక్షణ కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత అతని ఆటలో ఎంతో మార్పు వచ్చింది. దీని ఫలితంగానే 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో ఏకంగా స్వర్ణ పతకం గెలిచాడు. ఇలా అతడు విసిరే టక్నిక్ చూసి కోచ్ లు కూడా ఒలంపిక్స్ లో పతకం ఖాయం అని అనే వారు. ఇలా అతడు పతకాలు సాధిస్తున్న క్రమంలో కూడా సర్పంచ్ అని ఊరి వాళ్లు అనే వారు. కానీ ఈ సారి గౌరవంగా పిలిచేవాళ్లు. ఇలా ఎగతాలి చేసిన వాళ్లే ఇప్పుడు అతడిని ఎత్తుకొని అభినందిస్తున్నారు.