టాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఛలో సినిమాతో తెలగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు గీతాగోవిందంతో ఆ మార్క్ ను సెట్ చేసుకుంది. అంతే కాకుండా అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. మహేశ్ బాబు సరసన ఈమె సరిలేరునీకెవ్వరులో నటించింది. తర్వాత ఇప్పుడు విడుదల రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్పలో కూడా నటించింది.
దీనిలో గిరిజన మహిళగా నిటించింది. అయితే రష్మికకు టాలీవుడ్ లోనే కాక బాలివుడ్ లో కూడా అవకాశాలు వచ్చేస్తున్నాయి. ‘గుడ్ బై’ చిత్రంతో బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తోంది కన్నడ బ్యూటీ. తొలి చిత్రంలోనే బిగ్ బి లాంటి లెజెండ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన్న. అయితే ఈ మధ్య ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. “అమితాబ్ తో నటించటం ఆనందంగా ఉంది. చాలా రోజుల పాటూ షూటింగ్ చేయటం వల్ల యాక్టర్స్ ఒకర్ని ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు. మేమంతా అదే చేశాం.
అందువల్లే చక్కటి పర్ఫామెన్సెస్ వచ్చాయి. డైరెక్టర్, మిగతా వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘గుడ్ బై’ సినిమా ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్” అని చెప్పుకొచ్చింది. మొదటి రోజు అమితాబ్‌తో కలిసి పనిచేసిన అనుభవాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అమితాబ్‌తో కలిసి నటించడం జీవితంలో మరిచిపోలేనిది అంటుంది ఈ బ్యూటీ. ‘ముందు రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత దర్శకుడు వికాస్‌తో నెక్స్ట్ డే చేయాల్సిన సన్నివేశాల గురించి ఎక్స్‌ప్లైన్ చేయించుకుని వాటిని అమితాబచ్చన్‌తో ఎలా చేయాలా అనేది చర్చించి మరీ ప్రాక్టీస్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.
ఆయనతో నటించేటప్పుడు పాత్రలో లీనమైపోవడంతో పెద్దగా ఆందోళన పడలేదని అంటుంది. ఆయనతో కలిసి నటించడం పెద్ద కష్టమే కాదు అని చెప్పుకొచ్చింది ఈ లక్కీ బ్యూటీ. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ‘గుడ్ బై’ మాత్రమే కాక సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’సినిమా కూడా చేస్తోంది ఈ భీష్మ బ్యూటీ.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…