Acharya Movie: తెరవెనుక ఉండి ఆచార్య సినిమా పై దుష్ప్రచారం… ఆ వర్గమే ఇలాంటి చర్యలకు పాల్పడిందా?

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా మూడు సంవత్సరాల నుంచి వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా రివ్యూ ఇస్తూ వచ్చారు.

అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందు నుంచి ఈ సినిమా పట్ల నెగిటివిటీ వస్తూనే ఉంది.అయితే సినిమా విడుదల కాకుండానే ఇలాంటి నెగిటివిటీ రావడంతో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ కథను నడిపిస్తున్నారని అర్థమవుతోంది.

ఆచార్య సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకూలంగా ఉండటానికి ఓ వర్గం వారు ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి పెద్ద ఎత్తున నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. ఇలా వీరి ప్రయత్నం కొంతమేర సక్సెస్ కూడా అయ్యింది.ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన విషయం ఏమిటంటే ఆ వర్గానికి చెందిన వారు కూడా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారే కావడం గమనార్హం.


రేటింగ్ బట్టి సినిమాలకు వెళ్లరు…

ఇలా ఈ సినిమాకి ముందు నుంచి దుష్ప్రచారం చేయడంతో కొంతమేర సినిమాకి నష్టం ఏర్పడిందా అంటే సోషల్ మీడియాలో వస్తున్న రేటింగ్స్ బట్టి జనాలు సినిమాకి వెళ్లారు.ఇలా సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అభిమానులు థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన తరువాతే సినిమాకి రివ్యూ ఇస్తారు. అయినా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఈ విధమైనటువంటి నెగిటివిటి రావడం కొత్తేమీ కాదు అయితే ఈసారి సరికొత్త విధానంలో ఈయన సినిమాకు నెగిటివిటీ ఏర్పడింది.