Congratulatory meeting for Minister Roja : ప్రేమ తపస్సు సినిమా తో రోజా సినీ ప్రయాణం మొదలు పెట్టిన సర్పయాగం సినిమా ద్వారా వెండితెర మీద మొదటిసారి కనిపించింది. ఇక సీతారత్నం గారి అబ్బాయి రోజా సినీ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత వెనుతిరిగి చూసుకునే పని లేకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల ను తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో వెలుగు వెలిగింది. తర్వాత ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు సెల్వమణి వివాహం చేసుకుంది. ఇక రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజ. పాలిటిక్స్ ను, సినిమాలను సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది.
రెండుసార్లు ఎమ్మెల్యే పదవి లో ఉన్నప్పటికీ రోజా పలు టీవీ కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతగా కనిపించారు.ఇక ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు కూడా స్వీకరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మంత్రి పదవి చేపట్టాక టీవీ ప్రోగ్రాంమ్స్ కు గుడ్ బాయ్ చెప్పేశారు. ఇప్పుడు తన మంత్రి పదవి మీదనే తన పూర్తి దృష్టిని, సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. రోజా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేయబోతున్నారు. మే 7న చెన్నైలో సినీ ప్రముఖుల చేత సత్కారం జరగనుంది.
రోజా అభినందన సభకు హాజరుకానున్న సినీ ప్రముఖులు….
అయితే రోజాకు ఈ అభినందన సభను దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తమిళ దర్శకనిర్మాతల సంఘం, సంగీత కళాకారుల సంఘాలు సంయుక్తంగా నిర్వహించనున్నారు.అన్నాశాలైలోని ఫిలిం ఛాంబర్ లో బుధవారం దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సీనియర్ దర్శకుడు అయిన భారతీరాజా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న భారతీరాజా ఒక హీరోయిన్ నుంచి మంత్రి గా ఎదిగిన రోజా తీరును అభినందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రోజా భర్త అయిన సెల్వమణి రోజాకు అభినందన సభ ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…