Acharya Movie : ఇంత వరకు ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాను కొనిదలల ప్రొడక్షన్ కంపెనీ ఇంకా మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వం, మెగాస్టార్ ఇంక రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై ఉండటం వలన ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. ఓకే స్క్రీన్ పై తండ్రి కొడుకులను చూసి అభిమానులు పొంగిపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఘన విజయం తర్వాత రామ్ చరణ్ తీసిన సినిమా కావడం, మూడేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు.
అయితే సినిమా అంతా ఆశించిన విజయం సాధించలేకపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. నాసిరకమైన గ్రాఫిక్స్ ఉపయోగించారు, పూజా హెగ్డే ఐరన్ లెగ్, రాజమౌళి తో హిట్ తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్.. లాంటి భీభత్సమైన ట్రోల్ల్స్ వస్తున్నాయి.
వీఎఫ్ఎక్స్ మీద మండిపడుతున్న ఫాన్స్…
ఆచార్య సినిమాకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ సోషల్ మీడియాలో లీక్ అవ్వగా, దాన్ని చూసిన నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో మెయిన్ ఫ్లాష్ బ్యాక్ సీన్, రామ్ చరణ్ చిరంజీవి కలుసుకునే సన్నివేశం. అయితే ఆ సన్నివేశంలో మెగాస్టార్ యుద్ధ వయసులోనూ రామ్ చరణ్ చిన్న పిల్లవాడి గాను కనిపించాలి. మెగాస్టార్ ని ఎందుకు చూపించడం కోసం విఎఫ్ఎక్ను ను చిత్రబృందం ఉపయోగించడం వలన చిరంజీవి మొహం గుర్తుపట్టలేని నట్టుగా, అసలు చిరంజీవేనా ఈ సీన్ లో ఉన్నది అన్నట్టుగా ఉంది. గ్రాఫిక్స్ ఉపయోగించకుండా చిరంజీవిని ఉన్నట్టుగానే చూపించి ఉంటే ఇంకా బాగుండేది అని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతమంది ఇంకొక అడుగు ముందుకేసి అది గ్రాఫిక్స్ కాదని చిరంజీవి డూప్ అని అంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…