Chiranjeevi:కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం, అలాగే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అన్ని అడ్డంకులను తొలగించుకుని ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు కొంతమేర నిరాశ కలిగించిందని చెప్పాలి. ఈ సినిమా చూసిన అభిమానులు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు పర్వాలేదని కామెంట్ చేస్తున్నప్పటికీ మరికొందరు రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే పూజా హెగ్డే ఐరన్ లెగ్ అంటూ తనపై కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నో అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా కాస్త నిరాశ పరిచిందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ఒక సన్నివేశం లీక్ అయింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఎలా కలుసుకున్నారనే విషయాన్ని చూపించారు.ఇందులో రామ్ చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని యవ్వనంగా చూపించే ప్రయత్నం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇలా చూపించడం కోసం దర్శకుడు
వీఎఫ్ఎక్స్ ఉపయోగించారు. ఇలా వీఎఫ్ఎక్స్ ఉపయోగించడం వల్ల మెగాస్టార్ చిరంజీవి మొహం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. చిరంజీవి మామూలుగానే పెద్ద వయసు ఉన్నట్టు కనిపించదు అలాంటి అతనికి ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ వాడటం వల్ల మెగా అభిమానులు దర్శకుడు కొరటాల శివ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే అక్కడ చిరంజీవి కాదు,ఆయన డూప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…