Nikhil Siddhartha Emotional comments : నిఖిల్ సిద్ధార్థ్ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం మధ్యాహ్నం నిఖిల్ తండ్రి గారు అయినా శ్యామ్ సిద్ధార్థ్ గారు అకాల మరణం పొందారు. నిఖిల్ తన తండ్రి తో తనకున్న అనుబంధాన్ని గురించి ఎన్నో సార్లు మీడియా ముందు చెప్పేవారు. అయితే తన తండ్రి అకాల మరణం తనని ఎంతగానో కలిచివేసింది. తాజాగా నిఖిల్ తన తండ్రితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు.
నీ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను.. మిస్ యు డాడీ..
తన తండ్రి అకాల మరణం తో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నిఖిల్ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టాడు…’నా తండ్రి శ్యామ్ సిద్దార్థ్ మరణంతో కుంగిపోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను డాడీ, లవ్ యూ. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నీతో కలసి సినిమా చూడటం, కలిసి తిరగడం, బయట బిర్యానీలు తినడం, సరదాగా నవ్వుకోవడం, సమ్మర్‌ను ముంబయి లో ఎంజాయ్ చేయడం.. ఇవన్నీ నేను మిస్ అవుతాను. నీ కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. మనం తప్పకుండా మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
తన తండ్రి గురించి మరి నోట్ లో ఇలా చెప్పుకొచ్చారు….ఆయన మంచి మనసున్న వ్యక్తి. వేలాదిమంది విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేసేవారు. తన చుట్టూ ఉండేవాళ్లను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచేవాడు. తను నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావుకు వీరాభిమాని. నన్ను వెండితెరపై చూడాలని ఆయన కలలు కన్నాడు. ఆయన సహాయసహకారాలు, ప్రోత్సాహం అందించడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. జేఎన్‌టీయూ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ఆయన స్టేట్ టాపర్ గా నిలిచారు . ఎప్పుడూ కష్టాన్ని మాత్రమే నమ్మేవాడు .జీవితాన్ని ఎంజాయ్ చేద్దామనుకునే సమయంలో కార్టికోబాసల్ డీజెనరేషన్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డాడు.ఈ వ్యాధితో ఎనిమిదేళ్లుగా పోరాడాడు. చివరికి ఈ పోరాటంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచాడు. నీ గురించి తలవకుండా ఒక్కరోజు కూడా నాకు ముందుకు సాగదు డాడీ’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…