Manoj Bajpayee comments on Bollywood : బాలీవుడ్ లో ప్రస్తుతం సౌత్ సినిమాల హవా బాగా నడుస్తోంది. అప్పుడు రాజమౌళి బాహుబలి సినిమా తో టాలీవుడ్లో చరిత్ర సృష్టించాడు. అయితే తాజాగా పుష్ప, ఆర్ఆర్ఆర్, KGF2 సినిమాలు బాలీవుడ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. హిందీ సినిమాలను పక్కకునెట్టి మరి సౌత్ సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమాలో దెబ్బకి బడా బాలీవుడ్ సినిమాలు సైతం విడుదల తేదీని మార్చుకునే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులు అయినా కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటివారు ఈ విషయం మీద స్పందించారు. అయితే తాజాగా మనోజ్ భాజపేయి ఈ విషయం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి….
సౌత్ సినిమాలైన ఆర్ఆర్ఆర్ కే జి ఎఫ్ 2 సినిమాలు అవలీలగా 300కోట్లను రాబట్టాయి. అయితే అక్కడి హిందీ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు రాబట్టడానికి కింద మీద పడుతున్నాయి. ఈ విషయంగా మనోజ్ భాజపేయి ఢిల్లీ టైమ్స్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు…. ఈ మధ్యకాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు వచ్చాయి. ఇది చూసి బాలీవుడ్ భయపడి పోతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి చూసి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది బాలీవుడ్. ఒకరకంగా చూస్తే ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్ కి గుణపాఠం నేర్పింది.
ప్రస్తుతం సౌత్ నుంచి వచ్చి ఘన విజయాలు సాధించిన పుష్ప, కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలను చూస్తే ప్రతి సీన్ అద్భుతంగా రావాలి అని పట్టుదలతో తీసినట్టు కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో ఈ పట్టుదల బాక్సాఫీస్ కలెక్షన్ల మీద మాత్రమే ఉంటుంది. సౌత్ సినిమా వాళ్ళు సినిమాను ఒక ఫ్యాషన్ గా చూస్తూ అంకిత భావంతో సినిమాని తీస్తారు. ప్రస్తుతం సౌత్ సినిమాల విజయాలను చూస్తుంటే బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోంది. ఖచ్చితంగా దీన్ని చూసి బాలీవుడ్ కొంతయినా నేర్చుకోవాలి అని మనోజ్ బాజ్ పేయి తన అభిప్రాయాలను తెలియ చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…