రష్యాలో మరో కొత్త స్ట్రెయిన్ వైరస్..!

కరోనా.. ఊసరవెల్లిలా ఎప్పటికప్పుడు తన రంగులు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను భయపెడుతున్న ఈ వైరస్ మరోసారి దాని రూపాన్ని మార్చుకుంది. తాజా సమాచారం ప్రకారం రాష్యాలో మరో కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు రష్యాలోని గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్‌ తొలిసారిగా మాస్కో నగరంలో గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ వైరస్ ను అదే నగరం పేరుతో ‘మాస్కో’ పిలుస్తున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం రష్యాలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాటిని గుర్తించి పరీక్షలు చేయగా ఈ కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. అయితే ఈ తాజా స్ట్రెయిన్‌ వైరస్‌ ను రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ పనిచేస్తుందో.. లేదో.. తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమైనట్టు గమలేయా నేషనల్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వివరించారు.