తండ్రి ఓంకార్ చనిపోవడంతో నిరుపమ్ జీవితం ఎలా తలకిందులయ్యిందో తెలుసా?

ఈ మధ్య ఏ సీరియల్‌ చూసినా ఆ కథనంలో ఇమిడిపోయేలా కనిపించే నటుడు నిరుపమ్ పరిటాల.. పుష్కరకాలంగా సీరియల్స్‌ ద్వారా ఆకట్టుకుంటున్న నిరుపమ్‌ ప్రస్తుతం కుంకుమపువ్వు, కార్తీకదీపం, ప్రేమ సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు.

2007లో చంద్రముఖి సీరియల్‌ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు నిరుపమ్. అది కెరియర్‌ పరంగానూ, జీవితంలో నిలదొక్కునేలా చేసింది. ఈ సీరియల్ లో నటించిన సమయంలో తన పక్కన లీడ్ యాక్ట్రెస్ గా పని చేసిన మంజులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు.

ఇక నిరుపమ్ తండ్రి నిన్నటి తరం నటుడు రచయిత అయినా ఓంకార్. సినిమా ఫీల్డ్ కి వస్తాను అని నిరుపమ్ చెప్తే అయన వద్దన్నారంట. ఓంకార్ సినిమా పరిశ్రమలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో ఆయన్ని సినిమా ఇండస్ట్రీ బాన్ చేసింది అనే ప్రచారం కూడా సాగింది. సినిమా ఫీల్డ్ లో ఉండే సమ్యలపై అయన గళం విప్పి ఎన్నో అవకాశాలను కూడా కోల్పోయారు. అందుకే ఆయనకు తన కొడుకు సినిమా ల్లోకి రావడం ఇష్టం లేదు.

చెన్నై లో చదివిన నిరుపమ్ ఇంజినీరింగ్‌ తర్వాత ఎంబీయే చేసారు. హీరో అవ్వాలని ఆశపడి నిమాల్లోకి రావాలనే ఆలోచనతో తండ్రిని ఒప్పించి చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అవ్వాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయం లో అయన కన్ను మూసారు. ఆ సమయంలో మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలా లేక తనకు ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ కి వెళ్లాలా అనే మీమాంసలో ఉన్న సందర్భంలో ఓంకార్ స్నేహితుడి ద్వారా చంద్రముఖి సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది.

తాను పడ్డ బాధలు కొడుకు పడకూడదని ఓంకార్ ఆలోచించిన నిరుపమ్ సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. ఒక అవకాశం వచ్చిందా కదా సీరియల్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం తో బుల్లి తెరకె పరిమితం అయ్యాడు. ప్రస్తుతం నిరుపమ్ ని బుల్లి తెరలో ఒక స్టార్ హీరో అనే చెప్పుకోవాలి. మొదటి అవకాశం తండ్రి పేరుతో వచ్చిన బిహేవియర్, డిసిప్లిన్, డెడికేషన్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. ఒక్క నటన మాత్రమే కాదు నిరుపమ్ కి తన తండ్రి లాగ ఎంతో టాలెంట్ కూడా ఉంది. ‘నెక్ట్స్‌ నువ్వే’ అనే తెలుగు సినిమాకి స్క్రిప్ట్‌ కూడా రాసాడు. ఇక జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ అనే సీరియల్ తో ప్రొడక్షన్ రంగం లోకి కూడా వచేసాడు నిరుపమ్ అలాగే ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ కూడా అతనే.

ఇక కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా ప్రస్తుతం నెలంతా షూటింగ్స్ తో బిజీ గానే ఉంటుంది నిరుపమ్ కి మొదట ఈ అవకాశం రాలేదట. కార్తీక దీపం సీరియల్ కోసం ఇద్దరు ముగ్గురు నటులను తానే సిఫార్సు చేసాడట. ఆ సీరియల్ కి ప్రొడ్యూసర్ తో ముగమనసులు అనే సీరియల్ లో నిరుపమ్ నటించగా తాను ఆడిషన్ కి పంపిన వాళ్ళు సరిగ్గా అనిపించకపోవడం తో ప్రొడ్యూసర్ నిరుపమ్ నే చేయమని అడిగారట. ఆలా ఆ రోజు మొదలైన సీరియల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెంచుకుంది. అయినా కూడా హీరో కాలేదనే బాధ మాత్రం నిరూపంలో ఉంటుంది. తన తండ్రి బ్రతికి ఉంటె ఈ రోజు వెండి తేరా పైన మంచి స్థాయిలో ఉండేవాడినని కానీ వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని తనకు నచ్చిన నటనలో స్థిరపడ్డందుకు సంతోషంగా ఉన్నానని నిరుపమ్ అంటూ ఉంటాడు. ఇక నిరుపమ్ భార్య మంజుల కూడా బుల్లి తెర లో పాపులర్ నటి కావడం విశేషం.