నాగార్జున లాంటి బిజినెస్ మైండ్.. డేర్ టాలీవుడ్‌లో మిగతా వారికి లేదా..?

టాలీవుడ్ హీరోలలో ఉన్న అందరికంటే అక్కినేని నాగార్జున పక్కా బిజినెస్ మేన్ అని.. ఆయనకున్న డేర్ మరొకరికి లేదని ఇప్పటికే చాలా సందర్భాలలో చెప్పుకున్నారు. కేవలం ఒకే ఒక్క సాంగ్ చూసి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి నిన్నే పెళ్ళాడతా లాంటి సినిమా అవకాశం ఇవ్వడం అంటే చాలా ధైర్యం ఉండాలి. పైగా ఈ సినిమాకు సంగీత దర్శకుడు సందీప్ చౌతా. అతను అప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఇక ఇలాంటి ప్రయోగాత్మకమైన సినిమాను సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ బ్యానర్‌లో నిర్మించడం అంటే కూడా ఓ సాహసమే.

ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో నాగార్జున లాంగ్ హేయిర్ స్టైల్ ఆ తర్వాత టాలివుడ్ స్టార్ హీరోలందరూ ఫాలో అయ్యారు. కానీ, నాగార్జునకు సూటయినట్టుగా మరే హీరోకు సెట్ అవలేదు. ఇక మంచి కమర్షియల్ సినిమాలు చేస్తున్న నాగ్..మణిరత్నం లాంటి దర్శకుడితో గీతాంజలి సినిమా చేయడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాల్సిందే. సరికొత్త మోకోవర్‌తో నాగ్ మెప్పిస్తాడా అని అందరూ భావించారు. కానీ, అది కూడా ఆ తర్వాత ఓ ట్రెండ్ అయింది.

ఈ క్రమంలోనే రాం గోపాల్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం మరో గొప్ప విషయం. అసలు దర్శకత్వ శాఖలో పనిచేయకుండానే రాం గోపాల్ వర్మకు తన సొంత బ్యానర్‌లో శివ సినిమా అవకాశం ఇవ్వడం కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. కానీ నాగార్జున అప్పుడు చేసిన సాహసం ఆయన ఇమేజ్‌నే మార్చేసింది. నాగ్ కెరీర్‌లో మాత్రమే కాదు అన్నపూర్ణ సంస్థలో..రాం గోపాల్ వర్మ కెరీర్‌లో ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌లా మిగిలింది. ఇక ఈ సినిమాకు ఎలాంటి అనుభవం లేని వర్మ వాడిన కెమెరా యాంగిల్స్, కట్ టు కట్ షాట్స్ ఆ తర్వాత నుంచి అందరూ ఫాలో అవుతున్నారు.

ఇలాంటి సంచలన నిర్ణయాలు నాగార్జున ఇప్పటికే ఎన్నో తీసుకున్నాడు. అలా తీసుకున్న మరో డెసిషన్ అన్నీ సినిమాలు రిలీజ్ తేదీని ప్రకటించి వాయిదా వేసుకున్న కొడుకుతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాను సంక్రాంతికి అనూహ్యంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడమే. అన్నీ సినిమాలు వాయిదా పడుతుంటే నాగార్జున ఎలా వస్తాడులే అనుకున్నారు. కానీ, బంగార్రాజు సినిమాను ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో కూడా తెలీదు. సినిమా 40 శాతం షూటింగ్ అయినప్పటి నుంచి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ వచ్చి సినిమా మీద అంచనాలు పెంచారు.

Bangarraju Movie: ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావయ్యా..బంగార్రాజు!

ఆ తర్వాత సినిమాను సెన్సార్‌తో సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి రెడీగా పెట్టారు. ఎప్పుడైతే రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయో.. ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా  బంగార్రాజు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు నాగార్జున. ఈ సినిమా అనుకున్నట్టుగానే విడుదల చేసి మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఎంత నమ్మకం లేకపోతే పెద్ద సినిమాల నిర్మాతలకు కూడా ధైర్యం చేసి రిలీజ్ చేయకపోయినా నాగార్జున మాత్రం బంగార్రాజును చాలా నమ్మకంగా రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకున్నారు.