పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు పెన్షన్లు తీసుకునే అవకాశం..!

ఏ పెన్షన్ అయినా వ్యక్తికి కేవలం ఒకటి మాత్రమే ఇస్తారు. అది కూడా కుటుంబంలో ఇద్దరు పెన్షన్ అందుకుంటే మాత్రం అందులోకూడా ఒక్కరికి మాత్రమే ఇస్తారు. అయితే తాజాగా మారిన నిబంధనల ప్రకారం ఒక్క వ్యక్తి రెండు పెన్షన్లను అందుకోవచ్చు. అంది కుటుంబంలో ఎవరో ఒకరు ఇలాంటి సౌకర్యాన్ని పొందొచ్చు.

ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కేంద్ర ఉద్యోగులు అయితే, ఇది సాధ్యమే. ఇంట్లో బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే దీనికి అర్హత పొందొచ్చు. దీని పూర్తి వివరాలను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ విడుదల చేసింది. కొన్ని షరతులకు లోబడి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భార్యభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండాలి.. అందులో ఒకరు సర్వీసు సయంలో లేదా రిటైర్ అయిన తర్వాత మరణిస్తే.. అందులో బతికిఉన్న మరో ఉద్యోగికి ఈ అవకాశం ఉంటుంది.

భర్త చనిపోతే, భార్య కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతుంది. భార్య మరణం తరువాత, భర్త కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇద్దరూ చనిపోతే, బతికున్న బిడ్డకు తల్లి అదేవిధంగా తండ్రి ఇద్దరి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. దీనికి సంబంధించి పెన్షన్ డిపార్ట్ మెంట్.. 75 ప్రధాన నియమాలు అనే సిరీస్ ను ప్రారంభించింది.

ఈ సిరీస్ ద్వారా పాత పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఆ తల్లిదండ్రుల ఆడపిల్లకు ఇంకా వివాహం కానట్లయితే పెళ్లి అయ్యే వరకు ఈ ప్రయోజనం పొందొచ్చు. ఒక వేళ వితంతువు అయితే పునర్వివాహం అయ్యే వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. కుమార్తె అవివాహితురాలైతే, ఆమె ఉద్యోగం చేయనంత కాలం కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందే హక్కు ఆమెకు కల్పించారు.