మనం ఏ పని చేయాలన్నా.. ఆరోగ్యంగా ఉంటేనే చేయగలం. శరీరంలో ప్రతీ అవయం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం, తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. దీనిలో ముఖ్యంగా గుండె పని తీరును మెరుగ్గా ఉంచుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పరిమిత మొత్తంలో చాక్లెట్, జున్ను, పెరుగు తినాలని ఇటీవలు పరిశోధనలో తేలిందని.. శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇటలీలోని నేపుల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ప్రతీ రోజు కనీసంలో కనీసం 200 గ్రాముల పాల ఉత్పత్తులను తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ జున్ను తినాలనుకుంటే.. అందులో 50 గ్రాములు తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుందట. అంతేకాకుండా చాక్లెట్ ను కొంత మొత్తంలో తీసుకుంటే.. అది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇలా డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనోల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మనం తినే ఆహారంలో ఆకుకూరల పరిమాణాన్ని కొంత పెంచాలి. అది గుండె పనిచేసే విధానాన్ని మెరుగు పరుస్తుందని అంటున్నారు. ఇలా చేస్తే 16 శాతం వరకు గుండె జబ్బులను రానివ్వదట. అదే సమయంలో, తృణధాన్యాలలో ఫైబర్ కనిపిస్తుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ 150 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే, ప్రమాదం 22%తగ్గుతుంది.
వ్యాయామంలో ముఖ్యంగా.. రెసిస్టెన్స్ బ్యాండ్‌లు లేదా పుషప్స్, చినుప్స్ వంటి శరీర బరువు వ్యాయామాలు చేస్తే గుండె జబ్బులను తగ్గించొచ్చు. ఈ వ్యాయామాల వల్ల కొలెస్టరాల్ ను కూడా నియంత్రించవచ్చు. ఏరోబిక్ వ్యాయామం గుండె పంపింగ్ సామర్థ్యాన్ని రోజూ 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులు మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…