టాలీవుడ్ లో ఇప్పటివరకు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. ఇలా తన నటన, అందం ,అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది హీరోయిన్ అంజలి. ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కూడా నటించారు.
వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో ఆమె నటించారు. ఈ ప్రాతకు ఆమెకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆమె నటనకు పలు సినిమాల్లో ఆఫర్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
దీనిని దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది. కథ ప్రకారం.. దీనిలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే కియారా అద్వానీని ఎంపిక చేశారు.
మరో హీరోయిన్ గా అంజలి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమాలో కూడా నటించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉండగా.. దీని తర్వాతనే రామ్ చరణ్, శంకర్ కాంబోలో సినిమా షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…