హోమ్ లోన్ తీసుకునే వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ వెల్లడించింది. గృహ రుణ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మినహాయించినట్లు తెలిపింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఆ బ్యాంక్ కస్టమర్లకు కేవలం 6.68 శాతం వరకు మాత్రమే వడ్డీని వసూలు చేయనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్లపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ కార్ లోన్స్, కార్ ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాల కోసం ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది. యోనో యాప్ ద్వారా దఖాస్తు చేసుకునే వారికి ప్రత్యేకంగా 0.25 శాతం డిస్కౌంట్ పొందుతారు. గోల్డ్ లోన్ తీసుకునే వారికి కూడా ఎస్బీఐ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లను అలర్ట్ చేసింది. కొన్ని గంటల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిపివేయనున్నట్లుగా ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెప్పింది.
ఆగస్టు 18 అర్థరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం వరకు సేవలు నిలిచిపోయాయి. నిర్వహణ కారణంగా ఆన్ లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్, కార్పొరేట్ బ్యాంకింగ్ సర్వీస్, యూపీఐ, ఐఎంపీఎస్ సహా అన్ని రకాల సౌకర్యాలలో అంతరాయం కలగనుందంటూ ట్వీట్ చేసింది. అంతే కాకుండా గోల్డ్ మానిటైజేషన్ కోసం ఈ బ్యాంక్ ఆఫర్ కల్పిస్తున్నట్లు తెలిపింది. 10 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసి.. వడ్డీని పొందొచ్చని తెలిపింది. ఈ డిపాజిట్ లు మూడు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది.. స్వల్పకాలిక డిపాజిట్ 1-3 సంవత్సరాలు.
మధ్యకాలిక డిపాజిట్లు 5-7 సంవత్సరాలు.. దీర్ఘకాలిక డిపాజిట్లు 12-15 సంవత్సరాల వరకు ఉంటాయి. స్వల్పకాలిక డిపాజిట్ల కింద, 1 సంవత్సరానికి 0.50 శాతం, 1-2 సంవత్సరాలకు 0.60 శాతం మరియు 2-3 సంవత్సరాలకు 0.75 శాతం వడ్డీ లభిస్తుంది. మధ్యకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటు 2.25 శాతం, దీర్ఘకాలిక డిపాజిట్‌లకు 2.50 శాతం వడ్డీ లభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ గోల్డ్ మానిటైజేషన్ అనేది మొదట్లో 30 గ్రాములు ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించగా.. తాజాగా 10 గ్రాముల వారు కూడా డిపాజిట్ చేసే విధంగా అవకాశాన్ని కల్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…