ntpc-eet-recruitment-2021-apply-for-50-female-engineering-executive-trainee-posts

NTPC లో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. కేవలం మహిళలకు మాత్రమే అవకాశం!

నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) నిరుద్యోగ మహిళలకు శుభవార్త తెలియజేసింది. ఈ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థలో ఖాళీగా ఉన్న 50 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ (ఈటీటీ)  పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలయింది. మే 6 దరఖాస్తుల స్వీకరణ చివరితేదీ.

ఎన్టీపీసీ విడుదల చేసిన ఈ పోస్టులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్-2021 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. నేషన‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ విడుదల చేసిన నోటిఫికేషన్ కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనబడింది.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న మహిళలు సంబంధిత ఈ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలలోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. దరఖాస్తు ఏప్రిల్ 16న 2021 ప్రారంభం కాగా, మే 6 2021 చివరి తేదీ. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు సంబంధిత అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం https://ntpccareers.net/ అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.