ntpc-eet-recruitment-2021-apply-for-50-female-engineering-executive-trainee-posts
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) నిరుద్యోగ మహిళలకు శుభవార్త తెలియజేసింది. ఈ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థలో ఖాళీగా ఉన్న 50 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ (ఈటీటీ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలయింది. మే 6 దరఖాస్తుల స్వీకరణ చివరితేదీ.
ఎన్టీపీసీ విడుదల చేసిన ఈ పోస్టులు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను గేట్-2021 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ కేవలం మహిళలకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా నోటిఫికేషన్లో పేర్కొనబడింది.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న మహిళలు సంబంధిత ఈ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలలోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. దరఖాస్తు ఏప్రిల్ 16న 2021 ప్రారంభం కాగా, మే 6 2021 చివరి తేదీ. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు సంబంధిత అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం https://ntpccareers.net/ అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…