wcr-apprentice-recruitment-2021-for-716-posts-at-indianrailways
పశ్చిమ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 716 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల భర్తీ కొరకు పలు నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://wcr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 716 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 135, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 102, వెల్డర్ (ఎలక్ట్రిక్ & గ్యాస్) ఉద్యోగ ఖాళీలు 43, పెయింటర్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 75, మెసన్ ఉద్యోగ ఖాళీలు 61, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 73, ప్లంబర్ 58, బ్లాక్ స్మిత్ ఉద్యోగ ఖాళీలు 63, వైర్ మెన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్ మేన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.
2021 సంవత్సరం ఏప్రిల్ 1 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…