Connect with us

Featured

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

Published

on

Advertisement

పశ్చిమ మధ్య రైల్వే నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 716 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే రైల్వే ఉద్యోగాల భర్తీ కొరకు పలు నోటిఫికేషన్లు విడుదల కాగా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. పదో తరగతితో పాటు ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://wcr.indianrailways.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం 716 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగ ఖాళీలు 135, ఫిట్టర్ ఉద్యోగ ఖాళీలు 102, వెల్డర్ (ఎలక్ట్రిక్ & గ్యాస్) ఉద్యోగ ఖాళీలు 43, పెయింటర్ (జనరల్) ఉద్యోగ ఖాళీలు 75, మెసన్ ఉద్యోగ ఖాళీలు 61, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలు 73, ప్లంబర్ 58, బ్లాక్ స్మిత్ ఉద్యోగ ఖాళీలు 63, వైర్ మెన్ 50, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10, మెషినిస్ట్ 5, టర్నర్ 2, ల్యాబ్ అసిస్టెంట్ 2, క్రేన్ అసిస్టెంట్ 2, డ్రాఫ్ట్స్ మేన్ ఉద్యోగ ఖాళీలు 5 ఉన్నాయి.

2021 సంవత్సరం ఏప్రిల్‌ 1 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంది. ఏప్రిల్ 30వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నోటిఫికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Advertisement

పదో తరగతి, ఐటీఐ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

Advertisement

Featured

Devara: చుట్ట మల్లే సాంగ్ డైరెక్టర్ కొరటాల కాదా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ జాన్వీ?

Published

on

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే .ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరై ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం చుట్టూ మల్లె పాటకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ జాన్వీ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పాట గురించి పలు ప్రశ్నలు వేశారు. జాన్వీతో ఈ పాటలు చాలా రొమాంటిక్ గా చేశారు మీ వైఫ్ చూసే ఇబ్బంది పడతారు సీన్లు మార్చమని కొరటాల చెప్పలేదా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ జాన్వీ సమాధానం చెబుతూ ఈ పాట షూటింగ్ థాయిలాండ్ లో జరిగింది అప్పుడు కొరటాలకు ఏదో పని కారణంగా అక్కడికి రాలేదు. దీంతో ఈ పాటకు కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కొరియోగ్రాఫర్ ..
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతూ ఏంటి ఇంత మంచి హిట్ సాంగ్ చేసినది కొరటాల కాదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ మధ్య రొమాన్స్ మరో లెవల్ అని చెప్పాలి ఈమె కూడా ఎన్టీఆర్ కి అనుగుణంగా డాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: వచ్చే జన్మలో మీ రుణం తీర్చుకుంటా… ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవర సినిమా ఫాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆరు రోజులకు బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తుంది.

Advertisement

ఇక ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కొరటాల డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో సందేహాలను కూడా వ్యక్తపరిచారు కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి ఉందని చెప్పాలి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బృందావనం సినిమాతో కొరటాల గారికి నాకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మాత్రం ఆయన నా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. ఈ జన్మలో మీకోసం నేను ఎంత చేసినా అది కేవలం వడ్డీ మాత్రమే అవుతుంది. మీ రుణం వచ్చే జన్మలో తీర్చుకుంటాను అంటూ అభిమానులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నా ఫ్యామిలీ మెంబర్..
ఇక దేవర సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవర 2 కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాను కూడా దేవర 2 షూటింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Bramhaji: ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా మేడం.. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్!

Published

on

Bramhaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ మంత్రి కొండ సురేఖ నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ మాట్లాడటమే కాకుండా అక్కినేని కుటుంబం పై ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇలా సమంత గురించి అక్కినేని కుటుంబం గురించి కొండా సురేఖ మాట్లాడటంతో ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆమె వ్యాఖ్యాలను తప్పుపడుతున్నారు.

Advertisement

ఇక నాగార్జున సైతం పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొండా సురేఖ కూడా ఒక మెట్టు దిగివచ్చి క్షమాపణలు చెప్పారు. ఇలా క్షమాపణలు చెప్పిన కేటీఆర్ విషయంలో తాను తగ్గేదే లేదంటూ మరో వీడియోని కూడా ఈమె విడుదల చేశారు. ఇందులో భాగంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు.. అసలు వారి విడాకులకు కారణం ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదు.

ఇండస్ట్రీలో నాకున్న అంతర్గత పరిచయం ద్వారా ఈ విషయం తెలిసిందంటూ కొండా సురేఖ మాట్లాడిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో పై బ్రహ్మాజీ స్పందిస్తూ వాళ్ళు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాల మేడం అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రభాస్ నా దేవుడు..
ఈ క్రమంలోనే కొంతమంది బూతులతో కామెంట్లు చేస్తున్నారు. వాటిల్లో ఓ నెటిజన్ వాడిన పదజాలన్ని రీ ట్వీట్ చేస్తూ నన్ను తిట్టాలంటే ఓన్ అకౌంట్‌తో, డీపీ పెట్టుకుని తిట్టాలని.. ప్రభాస్‌ నా దేవుడు ఆయన డీపీ పెట్టుకుని నన్ను తిట్టితే అతన్ని తిట్టినట్టు అవుతుందని ఫ్యాన్స్ ఫీల్‌ అవుతారని రిప్లై ఇచ్చాడు. పనిలో పనిగా మీ అమ్మగారిని కూడా అడిగానని చెప్పండి అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!