NTR : నందమూరి కుటుంబం, టీడీపీ అప్పుడు పెట్టిన ఇబ్బందులకు ఇపుడు తారక్ రివేంజ్ తీర్చుకుంటున్నాడా…? ఎన్టీఆర్ ప్లాన్ ఇదే : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్

NTR : ఇటీవల జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం గురించి తెలిదిందే. యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు కు బదులుగా వైస్సార్ పేరు పెట్టాలని జగన్ నిర్ణయంతో నందమూరి కుటుంబంతో పాటు, పార్టీలకు అతీతంగా అందరు వ్యతిరేకంచారు. జగన్ సోదరి షర్మిల కూడా వ్యతిరేకంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హేయమైన చర్య అంటూ గవర్నర్ ఫిర్యాదు చేసి దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈక్రమంలో తారక్ కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అయితే తారక్ చేసిన ట్వీట్ వివాదలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు స్పందించారు.

ఇపుడు తారక్ రివేంజ్ తీర్చుకుంటున్నాడా…….

యూనివర్సిటీ పేరు మార్పు పై ఎన్టీఆర్ స్పందించిన విధానం అటు కోపంగా లేదు, వ్యతిరేకత భావం కూడా కనిపించలేదు. ఈ విధమైన ట్వీట్ చర్చలకు దారితిస్తోంది. నందమూరి కుటుంబం నుండి కళ్యాణ్ రామ్, బాలకృష్ణ మిగిలిన అందరు కూడా చాలా గట్టిగ వారి గొంతు వినిపించారు. ఎన్టీఆర్ అలా ట్వీట్ చేయడంతో పార్టీలో లోకేష్ కు ప్రాదాన్యత పెరుగుతుందటంతో కావాలని పార్టీ కి దూరం అవ్వాలని ఇలాంటి ట్వీట్ చేశారు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అమితాషా ను కలవడం వలన ఇలా స్పందించి వుంటారు అని కూడా అనుకున్నారు.

కానీ ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రచారాలకు దూరంగా వుంటాను అని అమితాషా కు చెప్పినట్టుగానే రాకకీయాలకు తావు ఇవ్వాల్సి వస్తుందని కూడా ఇలా చేసిండవచ్చు అని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఒకప్పుడు నందమూరి కుటుంబం, టీడీపీ ఆయనను ఇబ్బంది పెట్టిన విషయం నిజమే కానీ దాని ప్రతీకారంగా ఇలా చేస్తున్నాడని కూడా వాదనలు వస్తున్నాయి. కానీ ఇది వారి కుటుంబ సమస్యగా భావించి ఆయన వేరేగా స్పందించింటే బాగుండేదాని నా అభిప్రాయం అని చెప్పారు. ఒక సెలబ్రిటీ హోదాలో వున్న వ్యక్తి కనుక ఏది చేసిన అలోచించి, వ్యక్తిగతంగా ఏదైనా చేసి ఉంటే బాగుండేదాని, ఎందుకంటే వారి తాత పేరు తో ఈ స్థానంలో వున్నారు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు.