ఎన్టీఆర్ వద్దంటే.. కృష్ణ చేసి ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డును సృష్టించారు..

గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి. సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోలు వారి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు.ఇక హీరో కృష్ణ విషయానికి వస్తే ఎన్నో విభిన్న కథాచిత్రాల్లో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందాడు.

సూపర్ స్టార్ కృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక కృష్ణ కెరీర్లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నాయి.అలాంటి విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా ఎంతో పేరు సంపాదించుకున్న సినిమా “అల్లూరి సీతారామరాజు” అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది.

ఇక ఈ సినిమాలోని పాటల విషయానికి వస్తే అది ఒక అద్భుతం. ఇప్పటికి ఈ సినిమాలోని పాటలు మనకు వినబడుతూనే ఉంటాయి. ముఖ్యంగా “తెలుగువీర లేవరా..”అనే పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంది. అసాధ్యుడు సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేశారు. ఈ సినిమాకు రామచంద్ర రావు దర్శకత్వం వహించారు.ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు కథ సిద్ధం కాగా ఈ సినిమాను దర్శకుడు రామచంద్రరావు ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు.

కథ మొత్తం విన్న ఎన్టీ రామారావు కథ అద్భుతంగా ఉందని చెప్పి, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు.ఈ క్రమంలోనే రామచంద్రరావు ఈ కథను కృష్ణ దగ్గరకు తీసుకు వెళ్లడం కృష్ణ అందుకు ఒప్పుకోవడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.ఈ విధంగా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దర్శకుడు రామచంద్రరావు అనివార్య మృతి వల్ల ఈ సినిమా మిగిలిన భాగాన్ని కెఎస్ఆర్.దాస్ తెరకెక్కించగా కృష్ణ పద్మాలయ సంస్థ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి షో లో అద్భుతమైన టాక్ సంపాదించుకుంది. ఈ విధంగా థియేటర్ల వద్ద మంచి విజయం దక్కించుకున్న ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ఒక అత్యున్నతమైన సినిమాగా నిలిచిపోయింది.