ఓబిసి బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్య​సభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. త్వరలో రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. సామాజిక న్యాయం, సాధికారత ధ్యేయంగా మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

కాగా రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితాను కలిగి ఉండేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుందన్నారు మంత్రి వీరేంద్ర. మొత్తంగా 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని స్పష్టం చేశారు.