కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆ మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆక్సిజన్ కొరతతో చాలామంది చనిపోయారని మనం వార్తా పత్రికల్లో.. మీడియాల మొన్నటి వరకు చాలానే విన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలో మరణించింది కేవలం ఒక్కరు మాత్రమే అంటూ ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు తమకు అందిన వివరాల ప్రకారం ఒక రాష్ట్రంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకరు మరణించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ రాష్ట్రం పేరును మాత్రం ఆయన బయట పెట్టలేదు. మిగిలిన రాష్ట్రాల్లో అలాంటి మరణాలు సంబవించలేదంటూ కేంద్రానికి తెలిపాయని అతను వెల్లడించారు.
పార్లమెంట్ లో అంతకముందు ఆక్సిజన్ కొరత కారణంగా సంభవించిన మరణాలను వెల్లడించాలంటూ కొంతమంది అడిగిన ప్రశ్నకు వివరాలను తెప్పించుకొని ఇలా మీడియా ముందు అగర్వాల్ వెల్లడించారు. ఈ ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన వారి వివరాలను ఈ నెల 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోగా అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరగా.. అయితే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు 13 రాష్ట్రాలు వివరాలను సమర్పించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఆక్సిజన్ కొరత కారణంగా పంజాబ్ లో కోవిడ్ మరణాలు చాలా చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై రాజకీయ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారని.. వారి వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తున్నాయి. ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతుంటే.. ఇతర దేశాల నుంచి సైతం దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…