Featured

బ్లాక్ బస్టర్ “చంటి” చిత్రాన్ని చూసి “అమ్మ కొడుకు” సినిమా తీస్తే ఏమైందో తెలుసా.?!

తమిళంలో 1991,పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‌”చిన్నతంబి”చిత్రంలో ప్రభు, ఖుష్బూ హీరో హీరోయిన్లుగా నటించారు. పూర్తిగా గ్రామీణ వాతావరణం కథతో కూడిన సినిమా అవడంతో “చిన్నతంబీ” సూపర్ డూపర్ హిట్ అయింది. తమిళ “చిన్నతంబి” సినిమాని తెలుగు దర్శక, నిర్మాతలు అనేక మంది చూశారు. ఆ సినిమాని బాలకృష్ణ హీరోగా సినిమా రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఇదివరకే ఆ సినిమా రీమేక్ హక్కుల్ని క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్.రామారావు ఆ చిత్రాన్ని కొని సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఆ విషయం తెలుసుకున్న బాలకృష్ణ మరో సినిమాకు కమిటయ్యారు.

కె.ఎస్.రామారావు ఒక దశలో రాజేంద్రప్రసాద్ ను హీరోగా తీసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచించారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో కానీ రాజేంద్రప్రసాద్ స్థానంలోకి విక్టరీ వెంకటేష్ వచ్చారు. కె.ఎస్.రామారావు ఈ సినిమాకు దర్శకుడిగా రవిరాజా పినిశెట్టిని ఎన్నుకున్నారు. రవిరాజా పినిశెట్టి తాను పెరిగిన గ్రామంలో ఒక వ్యక్తిని చంటి అని పిలిచేవారు. అలాగే ఈ సినిమాకి కూడా రవిరాజా పినిశెట్టి చంటి అని పేరు పెట్టారు. విదేశాల్లో చదువుకొని వచ్చిన వెంకటేష్ ఇలాంటి పల్లెటూరి అమాయకపు పాత్రలో నటించడం కష్టం అనుకున్నారు. కానీ తమిళ చిన్న తంబీ సినిమాని చూసిన వెంకటేష్ ఆ సినిమాని తెలుగులో చేస్తానని కె.ఎస్.రామారావుకి మాట ఇవ్వడం జరిగింది. తెలుగులో చిన్నతంబీ రీమేక్ చేయడానికి దాదాపు చాలా మంది హీరోలు ప్రయత్నం చేసినప్పటికీ చివరికి హీరో వెంకటేష్ నటించారు.

వెంకటేష్ తల్లిగా సుజాత, జమీందారుగా నాజర్, దివాణంలో బ్రహ్మానందం హాస్యం సినిమా విజయానికి తమ వంతు పాత్రను పోషించారు. ఇళయరాజా స్వరపరచిన పాటలు అద్భుతంగా నిలిచాయని చెప్పవచ్చు. “ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు”… “అన్నుల మిన్నుల అమ్మడికన్నులు”.., “పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం” పాటలు ఆనాడు గ్రామాల్లో జరిగే పెళ్లి వేడుకల్లో ఎక్కువగా వినిపించాయి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఘన విజయానికి ఈ పాటలు ఎంతగానో దోహదపడ్డాయి…

హీరో రాజశేఖర్ కూడా చిన్న తంబీ తెలుగులో రీమేక్ చేద్దామని ప్రయత్నించినవారిలో ఒకరని చెప్పవచ్చు. అది మిస్ కావడం.. పైగా ఘన విజయం సాధించడంతో అలాంటి సినిమానే తీయాలనుకున్నారు. అలా క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన “అమ్మ కొడుకు” సినిమాలో రాజశేఖర్, ఆమనీ, సుకన్య హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీవిద్య ఒక ప్రధాన పాత్రలో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించారు. చంటి సినిమా కి అద్భుతమైన పాటలు స్వరపరిచిన ఇళయరాజా అమ్మ కొడుకు చిత్రానికి అలాంటి పాటలు ఇవ్వలేకపోయాడు. “కోవెల గంటలు ఏమన్నాయో” అనే పాట తప్ప మిగతా పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. 1993 లో వచ్చిన అమ్మ కొడుకు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago