Renu desai: నేను ప్యాకేజీ తీసుకోలేదు.. సంచలనంగా రేణు దేశాయ్ పోస్ట్.. పవన్ ని ఉద్దేశించి అన్నారా?

Renu desai: రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్నారు.

మరోవైపు ఏపీలో సైతం సినిమా సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నికల హడావిడి మొదలైనటువంటి తరుణంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సినీనటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

హైదరాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవి లత పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈమె ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక ఫోటోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ని చూశాను. ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదు నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

స్ట్రాంగ్ ఉమెన్..
అయితే ఈమె నేను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకోలేదు అంటూ ఈ సందర్భంగా కామెంట్ చేయడంతో ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే పోస్ట్ చేశారని తెలుస్తుంది .పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని పలు పార్టీలకు అమ్ముడుపోయారంటూ భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో తాను డబ్బు తీసుకోలేదంటూ ఈమె కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా కామెంట్ చేశారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.