Nikhil: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి నెలకొంది ఈ క్రమంలోని నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్లుగా పలువురు జబర్దస్త్ కామెడీగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తరపున కూడా పలువురు సినీ సెలబ్రిటీలు ప్రచార కార్యక్రమాలను చేస్తూ కూటమి గెలుపుకు దోహదపడుతున్నారు. చీరాల అభ్యర్థిగా మాల కొండయ్య యాదవ్ టిడిపి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయన గురువారం నామినేషన్ వేశారు ఈ నామినేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీగా కొండయ్య బయలుదేరి వెళ్లారు అయితే ఈ ర్యాలీలో హీరో నిఖిల్ పాల్గొనడం విశేషం. ఇలా హీరో నిఖిల్ ఈ ర్యాలీలో పాల్గొనడమే కాకుండా చీరాలకు చిరునవ్వులు రావాలి అంటే కొండయ్య గెలవాలని ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
కూటమికి మద్దతుగా నిఖిల్..
అయితే ఈయన పార్టీల పరంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదని తెలుస్తుంది కొండయ్య పెద్ద కుమారుడు అమర్ నాథ్ స్వయానా నిఖిల్ సోదరిని వివాహం చేసుకోవడంతో వీరి మధ్య బంధుత్వం ఏర్పడింది. ఈ బంధుత్వం కారణంగానే నిఖిల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…