Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రీ రిలీజ్… ఎన్నికల మైలేజ్ కోసమే ప్రయత్నమా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న సినిమాలన్నింటికీ కాస్త విరామం ప్రకటించి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం జనసేన అధినేతగా ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా వేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలో బుల్లితెర నటీనటులు అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఇలా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

అన్యాయంగా ఒక కేసులో ఎరుకొని శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతున్నటువంటి ముగ్గురు అమ్మాయిలకు శిక్ష పడుతున్నటువంటి తరుణంలో హీరో వారిని ఎలా కాపాడారు అన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఎన్నికల మైలేజ్..
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తాజాగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మే 1వ తేదీ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా తిరిగి విడుదల కాబోతోంది అయితే ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేయడం వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తుంది త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మైలేజ్ కోసమే ఈ సినిమాని విడుదల చేస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ప్రయోజనకరంగా మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.