హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నారా.. అయితే వీటి గురించి మీకు తెలియాలి..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెల్త్ ఇన్సూ రెన్స్ అనేది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరూ ఊహించలేరు. అయితే సాధారణంగా తీసుకునే బీమాకి అన్ని రకాల సదుపాయాలు ఉండకపోవచ్చు. అందుకే దీనికి కొన్ని రకాల రైడర్లను చేర్చుకోవడం మంచి పద్ధతి. దీనివల్ల మీ ఇన్స్యూరెన్స్ కవరేజీ చాలా రకాల కేటగిరీలకు అప్లై అయ్యేలా చేసుకోవచ్చు. మీ లైఫ్ పాలసీని కస్టమైజ్ చేసేందుకు ఈ రైడర్లను ఉపయోగించుకోవచ్చు.

వాటి గురించి ఇప్పుడు మనం తెలుసకుందాం.. ఇందులో ముఖ్యంగా క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ అనేది ఏదైనా తవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ రైడర్ తీసుకోవడం ద్వారా బీమా కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లిస్తాయి. గుండె పోటు, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు ఇది వర్తిస్తుంది. తర్వాత చెప్పుకోదగ్గ రైడర్ ఏంటంటే.. వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ దీనిలో ఇన్సూరెన్స్ పర్సన్ ఒకవేళ మరణిస్తే లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే ప్రీమియం చెల్లించలేకపోతే ఇన్స్యూరెన్స్ కంపెనీయే మిగిలిన ప్రీమియంలన్నింటినీ కడుతుంది.

పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీ హోల్డర్ లేదా అతడి కుటుంబ సభ్యులకు మెచ్యూరిటీ బెనిఫిట్స్ అందుతాయి. మరో రైడర్ గురించి తెలుసుకుందాం. దానిలో పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్ మరొ ముఖ్యమైన రైడర్. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం ఎదురైతే దానివల్ల పనిచేసే పరిస్థితి లేకపోతే పాలసీ టర్మ్స్ ప్రకారం కొంత మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ద్వారా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో బేసిక్ పాలసీ ద్వారా ఇన్స్యూరెన్స్ చేసిన వ్యక్తికి కొంత మొత్తం వస్తుంది. అయితే దీనికి అదనంగా ప్రమాదంలో మరణించిన వ్యక్తికి డబ్బు రావాలంటే ఈ రైడర్ తీసుకోవచ్చు. ఇవే కాకుండా మరి కొన్ని రైడర్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి గురించి మీరు తీసుకునే ఇన్సరెన్స్ కంపెనీని సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ రైడర్లు అన్నీ బేసిక్ పాలసీకి అదనంగా చేర్చుకోవచ్చు.