తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన నాని అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే.. కరోనా మొదటి వేవ్ లో అయినా.. సెకండ్ వేవ్ లో అయినా ముందుగా మూసేసినది థియేటర్లు. కానీ బార్లు, రెస్టారెంట్లు మాత్రం లేట్ గా మూసేశారు. లాక్ డౌన్ సడలింపులో కూడా త్వరగా వాటినే తెరిచారు.
అసలు బార్లు, పబ్బుల కంటే ఎక్కువగా సేఫ్ ఉండేది థియేటర్ లోనే అన్నాడు. తన సినిమాలకు కూడా సైలెంట్‌గానే ఉండే నాని.. తిమ్మరుసు ఈవెంట్‌లో మాత్రం ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. థియేటర్స్ అంటే ఎందుకు పెద్దలకు అంత చిన్న చూపో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రతీ చిన్ని విషయానికి ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లే సినిమా పెద్దలు ఈ విషయంపై ఎందుకు చర్చించడం లేదంటూ ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది బతుకుతున్నారని.. దీని వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి.. కానీ సినిమా టికెట్ రేట్లు మాత్రం తగ్గించమంటున్నారు. దీనికి గల కారణం ఏంటో తెలియడం లేదన్నారు.
తన ‘టక్ జగదీష్’ విడుదలకు ఉందని ఇదంతా చెప్పడం లేదు.. కచ్చితంగా బార్లు, రెస్టారెంట్‌లతో పోలిస్తే థియేటర్స్ సేఫ్ అంటూ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. దీనిపై చర్చించిన కొందరు నానీ అడిగిన దాంట్లో న్యాయం ఉందంటూ దీనిపై పెద్దలు ఆలోచించాలని వారు కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…