పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త సర్వీసులు..?

కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పెన్షన్ తీసుకునే వాళ్లకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ శుభవార్త చెప్పింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ సబ్‌స్క్రైబర్ల కొరకు పీఎఫ్ఆర్‌డీఏ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా పీఎఫ్ఆర్‌డీఏ తెచ్చిన మూడు ఆన్ లైన్ సర్వీసుల ద్వారా నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరిన వారికి ప్రయోజనం చేకూరనుంది.

పీఎఫ్ఆర్‌డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్ల కొరకు డి రెమిట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చి్ది. డి రెమిట్ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతా నుంచి డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. బదిలీ చేసిన రోజే నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్ స్క్రైబర్లను నెట్ అస్సెట్ వాల్యూ ద్వారా సెటిల్‌మెంట్ జరుగుతుంది. డి రెమిట్ ఫెసిలిటీ ద్వారా ఎన్‌పీఎస్ సబ్ ‌స్క్రైబర్లు డబ్బులను సిప్ రూపంలో సైతం ఇన్వెస్ట్ చేయవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ సిప్ మాదిరి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటం ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ సిగ్నేచర్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నామినీని మార్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నామినీ పేరును మార్చుకునే అవాకాశాలు ఉన్నాయి. వీటితో పాటు కస్టమర్లకు ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఆన్‌లైన్ వీడియో బేస్డ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్‌ ను కూడా పీఎఫ్ఆర్‌డీఏ అందుబాటులోకి తీసుకురావడంతో ఇకపై మరింత సులభంగా డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ఆర్‌డీఏ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సర్వీసుల వల్ల నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో చేరిన వారికి ప్రయోజనం చేకూరుతుంది.