ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ పాలసీ ఎంతో అవసరం. డబ్బును పొదుపు చేయడంతో పాటు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే కచ్చితంగా పాలసీలను తీసుకోవాలి. అయితే ప్రైవేట్ రంగ సంస్థల్లో పాలసీలు తీసుకోవడం కంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పాలసీ తీసుకోవడం మంచిది. ఎల్ఐసీ కస్టమర్ల కోసం కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తోంది.
పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలన్నా, ఘనంగా పెళ్లి చేయాలన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీ తీసుకోవడం మంచిది. తక్కువ ప్రీమియంతో ఈ పాలసీ ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ పాలసీ పేరు జీవన్ లక్ష్య పాలసీ అయినా చాలామంది ఈ పాలసీని కన్యాధాన్ పాలసీ అని పిలుచుకుంటారు. ఈ పాలసీ తీసుకుంటే పెళ్లి సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి అలా పిలుస్తారు.
ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీలో నెర్లకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏకంగా 23 లక్షల నుంచి 30 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించలేని వారికి ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీ టర్మ్ 25 సంవత్సరాలు కాగా 22 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ప్రీమియం భవిష్యత్తులో చెల్లించాల్సిన అవసరం ఉండదు. నామినీ ఈ పాలసీ ద్వారా ప్రతి సంవత్సరం పాలసీ మొత్తంలో 10 శాతం మెచ్యూరిటీ ఏడాది కంటే ఒక సంవత్సరం ముందు వరకు పొందే అవకాశం ఉంటుంది. ప్రీమియం సరిగ్గా చెల్లిస్తే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…