పార్లమెంట్లో ప్రతిపక్షాల వైఖరిని తప్పు పట్టిన పీయూష్ గోయల్.

పార్లమెంట్ లో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అత్యున్నత సభలో ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాదిరిగా దాడులకు పాల్పడిన సభ్యుల వేతనాలను జప్తు చేయాలని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్లో మహిళా ఎంపీలపై దాడి పట్ల కొందరు సీనియర్ నేతలు బహిరంగంగా అబద్ధాలు మాట్లాడడం బాధ కలిగించిందన్నారు కేంద్ర మంత్రి. ప్రతిపక్షాలు ప్రధానంగా సమస్యను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గడువు కంటే ముందుగానే ముగిసాయి. పెగాసస్ స్పైవేర్ తో పాటు వ్యవసాయ చట్టాల రద్దు పట్ల ఉభయసభల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరిగాయి.