వీడియో వైరల్: రోడ్డుపై చిందులు వేసిన యువతి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..

కొంతమంది ఈ సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి గుర్తింపు కోసమే ఓ మహిళ అతి పెద్ద సాహసం చేసి సాహసం చేసి… అందరి దృష్టిలో పడింది. కానీ ఆమెను గుర్తుంచిన వారికన్నా ఆగ్రహించుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇంతకు అంతలా నెటిజన్లు ఆమెను ఆగ్రహించుకోవడానికి గల కారణం ఏమంటే.. రోడ్డుపై వెళ్లే సమయంలో సిగ్నల్ పడితే అందరం ఆగి గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా వెయిటింగ్ చేస్తాం.

అయితే ఇక్కడ ఆ వెయిటింగ్ సమయంలో.. ఓ యువతి రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ లు వేస్తూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్‌ వద్ద శ్రేయా కల్రా అనే మహిళ రెడ్ లైట్ పడిన సమయంలో డ్యాన్స్ చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పోస్టు తెగ వైరల్ కాగా.. దాని కింద నెటిజన్లు ఆమె చేసిన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో అలాంటి పని ఏంటంటూ.. ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పోస్టు చేయడమే కాకుండా ఆమె ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. దయచేసి నియమాలను ఉల్లంఘించవద్దు.

రెడ్ గుర్తు ఉంటే మీరు సిగ్నల్ వద్ద ఆగిపోవాలి. నేను డ్యాన్స్ చేస్తున్నందుకు కాదు. అలాగే అందరూ మాస్క్‌లు ధరించండి అని పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా వాహనదారులు ఇబ్బందులకు గురవ్వడంతో పాటు.. వాళ్ల ఏకాగ్రత మొత్తం వేరే వైపు మళ్లడంతో ప్రమాదాలు సంభవించే ప్రమాదం కూడా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన పై అధికారులకు తెలవడంతో వాళ్లు ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు హోం మంత్రి ఆదేశాలను జారీ చేశారు.