ఓ వ్యక్తి తన ప్రేయసిని 10 ఏళ్ల పాటు నిర్భందించిన ఘటన కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో మలో కీలక విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రెహమాన్, సజిత ఇద్దరు ప్రేమికులు. 2010 సంవత్సరంలో సజిత పెళ్లి చేసుకోవాలనే కారణంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు.
అప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు. తర్వాత ఇంట్లో వాళ్లు కూడా ఆమెను వెతకడం మానేశారు. రెహమాన్ పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించాడు. సజితను అతడు ఎవరికీ తెలియకుండా తన ఇంట్లోనే పది సంవత్సరాలు బంధించాడు. బయట ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఒక గదిలో ఉంచాడు. అయితే తాజాగా వాళ్లిద్దరు వితనస్సేరీలోని ఒక చిన్న ఇంటికి మారారు. అతడి కుటుంబసభ్యులు రెహమాన్ కనిపించడంత లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో అతడి విషయాలు ఏమి లభ్యం కాలేదు. అయితే ఓ నెన్మారా ప్రాంతంలో అతడి ఆచూకీ కనుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సజితను 10 ఏళ్లు బంధించిన మాట వాస్తవమే.. కానీ ఆమె ఇష్టంతోనే ఇలా చేశానని.. ప్రేమించుకున్న తాము పెళ్లిచేసుకోవాలని అనుకున్నామన్నారు.
ఆమెతో సహజీవనం చేసినట్లు చెప్పాడు. దీంతో ఆమెను పిలిచి పోలీసులు అడగ్గా.. అతడంటే ఇష్టమని చెప్పడంతో కేసు కొట్టేశారు పోలీసులు. తర్వాత వాళ్లిద్దరు అక్కడే రిజిస్టార్ ఆఫీస్ కు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పురగోమన కళా సాహిత్య సంఘం కొల్లంకోడు సమితి చేసింది. ఇక తాము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.. అతడు మీడియాతో చెప్పాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…