Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

Posani Krishna Murali:గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న సినీ హీరోలు డైరెక్టర్లు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?
Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఈ మీటింగుకు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, చిరంజీవి, కొరటాల వంటి వారు హాజరయ్యారు. ఇక వీరు సినిమా సమస్యల గురించి టికెట్ల వ్యవహారం గురించి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు బయటకు చెబుతున్నారే కానీ లోపల ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ లోపల ఈ అంశాల గురించిచర్చించి ఉండవచ్చు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఇక ఈ మీటింగుకు నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో పోసాని మాట్లాడుతూ స్టార్ హీరోలపై సెటైర్లు వేశారని వినికిడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోలందరూ భారీగా పారితోషకాలు పెంచడం వల్ల వైసీపీ ప్రొడక్షన్స్ పెరిగిపోయే నిర్మాతలపై భారం పడటం వల్ల సినిమా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారు అంటూ పోసాని స్టార్ హీరోలను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

విషయం పక్కదారి పట్టించ వద్దు…

పోసాని మురళి కృష్ణ ఈ విధంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించవద్దని పోసానికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు క్లారిటీ ఉందో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరం ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే సమస్యను సృష్టించారో వారికి వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్ల కన్నా పవన్ కళ్యాణ్, నాని, హీరో సిద్ధార్థ్ వంటి వాళ్లే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.