Prabhakar Son: యాటిట్యూడ్ స్టార్ అంటూ ప్రభాకర్ కొడుకు పై భారీ ట్రోలింగ్ చేస్తున్న నేటిజన్స్.. రెండు రోజులకే స్టార్ స్టేటస్!

Prabhakar Son:సినిమా ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం ఎంతోమంది హీరో హీరోయిన్లు పరిచయం అవుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. కేవలం నటన నైపుణ్యం మాత్రమే కాకుండా,అదృష్టంతో పాటు మన ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. ఇలా అన్నీ ఉన్నప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి.

ఇండస్ట్రీలో కొనసాగే వారు క్రమశిక్షణతో కాకుండా యాటిట్యూడ్ చూపిస్తూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఎంతో కష్టతరమవుతుందని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు.ఇదిలా ఉండగా తాజాగా నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ ని ఈయన హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే తన డెబ్యూ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అంటూ ప్రభాకర్ తన పుట్టినరోజు సందర్భంగా తన కొడుకు గురించి వెల్లడించారు. ఇక తాను నటించిన మొదటి సినిమా కూడా విడుదలకుండానే తనకు మూడు సినిమా అవకాశాలు కూడా వచ్చాయంటూ ఈ సందర్భంగా ప్రభాకర్ తన కొడుకు గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో తన కొడుకు నిలబడిన విధానంలో ఆ టైంలో ప్రదర్శించిన యాటిట్యూడ్ పై పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యారు

ఒకవైపు తన తండ్రి మాట్లాడుతుండగా ఆయన మాత్రం వెనక నిలబడి తన ఆటిట్యూడ్ చూపించారు. బహుశా విజయ్ దేవరకొండ విశ్వక్సేను అనుసరిస్తున్నారేమో తెలియదు కానీ ఈయన కూడా వారిలా ఆటిట్యూడ్ చూపించడంతో పెద్ద ఎత్తున నేటిజన్లో ట్రోలింగకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఈయన డేబ్యు సినిమా విడుదల కాకుండానే యాటిట్యూడ్ స్టార్ అంటూ స్టార్ క్రెడిట్ ఇచ్చారు.

Prabhakar Son: మొదటి సినిమాకే స్టార్ ట్యాగ్ సంపాదించిన చంద్రహాస్…

ఇలా చంద్రహాస్ ఆటిట్యూడ్ గురించి మాట్లాడుతూ నేటిజన్స్ పెద్ద ఎత్తున నెటిజెన్స్ భారీ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రహాస్ మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే ఇలాంటి విమర్శలపాలు కావడంతో ఈయన కెరియర్ గురించి పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రహాస్ మొదటి సినిమాకే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.