Prabhakar: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రభాకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈయన కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా చిన్న చిన్న సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈయన కుమారుడు చంద్రహాస్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేశారు. అయితే నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి ఈయన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రహాస్ 22వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాకర్ తన కుమారుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారని ప్రస్తుతం తాను మూడు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారంటూ తన కొడుకు గురించి ప్రభాకర్ తెలియజేశారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకర్ మీ కుమారుడు సినీ ఎంట్రీ పై నెపోటిజం, ట్రోల్స్ ఏమైనా వచ్చాయా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ వాడిని కేవలం పరిచయం మాత్రమే చేశాను. ఇంకా తను నటించిన సినిమాలు విడుదల కాలేదు అంటూ సమాధానం చెప్పడమే కాకుండా తనని పరిచయం చేసిన సంఘటన పైనే పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయని వాడు ఇలా ఫోజులు కొడుతున్నాడు వీడేం హీరో..యాటిట్యూడ్ చూపిస్తున్నారట పెద్ద ఎత్తున తన కొడుకు గురించి ట్రోల్స్ వస్తున్నాయని ఈ సందర్భంగా ఈయన స్పందించారు.
నా కొడుకు ఎలా నిలబడిన, ఎలాంటి ఫోజులు కొట్టినా, వాడు ఎలాంటి ఆటిట్యూడ్ చూపించిన మొత్తానికి జనాల దృష్టిని ఆకర్షించారు. ఏం చేసేనా జనాలలోకి వెళ్లాలని చెప్పాను. అయితే ప్రస్తుతం తను ఆటిట్యూడ్ చూపిస్తూ జనాలలోకి వెళ్లారు. అది ప్రేక్షకులకు నచ్చలేదు నచ్చలేదని మొహం మీద చెప్పేశారు. అదేవిధంగా తాను సినిమాలలో నటించినప్పటికీ తన సినిమాలు నచ్చితే నచ్చాయని లేకపోతే లేదని చెబుతారు.జనాలు చాలా ప్లెయిన్ గా ఉంటారు వారికి అనిపించింది చెబుతారు అంటూ ఈ సందర్భంగా తన కొడుకు గురించి వచ్చిన ట్రోల్స్ పై ప్రభాకర్ స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…