Featured

Pruthvi : నా కొడుకు మాట్లాడలేదు… ఆ వ్యాధితో బాధపడుతున్నాడు… 9 ఏళ్ళు డిప్రెషన్ లో ఉండిపోయాను… ఎమోషనల్ అయిన పృథ్వీ..!

Pruthvi : సినిమాలతో మొదలు పెట్టి సీరియల్స్ లోకి వెళ్లి తమిళ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన పృథ్వీ తెలుగులో మాత్రం ‘పెళ్లి పృథ్వీ’గా బాగా ఫేమస్ అయ్యాడు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ ‘సమరసింహా రెడ్డి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ. అయితే తెలుగులో చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న పృథ్వీ గారు పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తన కొడుకు గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు.

నా కొడుకు కి ఆ వ్యాధి ఉండటం వల్ల ఎనిమిదేళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళాను…

పృథ్వీ గారి కొడుకు పుట్టి తరువాత రెండేళ్లకు తాను అందరిలా నార్మల్ కిడ్ కాదు అని అర్థమైంది. తాను ఆటిజంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇక తన గురించి అలోచించి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అందుకే సినిమాలను కూడా కొన్నేళ్లు వదిలేసాను అంటూ చెప్పారు. ఎందుకు ఇక చేయాలి సినిమాలు ఎందుకు డబ్బు సంపాదించాలి అనే వైరాగ్యం వచ్చింది. కానీ మళ్ళీ నా ఆలోచన తప్పని అర్థమైంది.

మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను. నా కొడుకు నాకు బలహీనత కాదు బలం అని అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం 27 వయసులో ఉన్న నా కొడుకు అన్ని పనులు తానే చేసుకోగలడు. కాకపోతే మాట్లాడలేడు అందరిలో ఉండడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతాడు అంటూ చెప్పారు. ఇక సినిమాలు మళ్ళీ చేసాక ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. ప్రతిరోజు జిమ్ చేస్తాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago