Connect with us

Featured

Prabhakar: కొడుకు చంద్రహాస్ పై భారీ ట్రోల్ చేస్తున్న నేటిజన్స్… ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన ప్రభాకర్!

Published

on

Prabhakar: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ప్రభాకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈయన కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా చిన్న చిన్న సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈయన కుమారుడు చంద్రహాస్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేశారు. అయితే నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి ఈయన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే చంద్రహాస్ 22వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాకర్ తన కుమారుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నారని ప్రస్తుతం తాను మూడు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారంటూ తన కొడుకు గురించి ప్రభాకర్ తెలియజేశారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాకర్ మీ కుమారుడు సినీ ఎంట్రీ పై నెపోటిజం, ట్రోల్స్ ఏమైనా వచ్చాయా అంటూ ప్రశ్నించారు.

Advertisement

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ వాడిని కేవలం పరిచయం మాత్రమే చేశాను. ఇంకా తను నటించిన సినిమాలు విడుదల కాలేదు అంటూ సమాధానం చెప్పడమే కాకుండా తనని పరిచయం చేసిన సంఘటన పైనే పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయని వాడు ఇలా ఫోజులు కొడుతున్నాడు వీడేం హీరో..యాటిట్యూడ్ చూపిస్తున్నారట పెద్ద ఎత్తున తన కొడుకు గురించి ట్రోల్స్ వస్తున్నాయని ఈ సందర్భంగా ఈయన స్పందించారు.

Prabhakar:జనాలు నచ్చకపోతే నచ్చలేదనే చెబుతారు…

నా కొడుకు ఎలా నిలబడిన, ఎలాంటి ఫోజులు కొట్టినా, వాడు ఎలాంటి ఆటిట్యూడ్ చూపించిన మొత్తానికి జనాల దృష్టిని ఆకర్షించారు. ఏం చేసేనా జనాలలోకి వెళ్లాలని చెప్పాను. అయితే ప్రస్తుతం తను ఆటిట్యూడ్ చూపిస్తూ జనాలలోకి వెళ్లారు. అది ప్రేక్షకులకు నచ్చలేదు నచ్చలేదని మొహం మీద చెప్పేశారు. అదేవిధంగా తాను సినిమాలలో నటించినప్పటికీ తన సినిమాలు నచ్చితే నచ్చాయని లేకపోతే లేదని చెబుతారు.జనాలు చాలా ప్లెయిన్ గా ఉంటారు వారికి అనిపించింది చెబుతారు అంటూ ఈ సందర్భంగా తన కొడుకు గురించి వచ్చిన ట్రోల్స్ పై ప్రభాకర్ స్పందించారు.

Advertisement

Featured

Renu Desai: బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు… పవన్ అభిమానికి ఇచ్చి పడేసిన రేణు దేశాయ్?

Published

on

Renu Desai: పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే అయితే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆయనకు దూరమయ్యారు. తనకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతోనే తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అంటూ పలు సందర్భాలలో రేణు దేశాయ్ వెల్లడించారు.

ఇలా పవన్ కళ్యాణ్ కు దూరంగా తన పిల్లలతో కలిసి బ్రతుకుతున్న ఈమె పట్ల తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే కామెంట్లతో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీస్తుంది అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఆయన పిల్లలు తన వెంటే ఉంటున్నారు.

ఇక ఈ విషయంపై రేణు దేశాయ్ కూడా సంతోషం వ్యక్తం చేసింది అయితే ఒక అభిమాని మాత్రం రేణు దేశాయ్ ను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్టుపై రేణు దేశాయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా సుధాకర్ అనే అభిమాని వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది.

Advertisement

పవనే నన్ను వదిలేసాడు..
ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాము అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ స్పందిస్తూ సుధాకర్ గారు మీరు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా.. బుద్ధి ఉంటే ఇలా మాట్లాడరు పవన్ కళ్యాణ్ కు నేను విడాకులు ఇవ్వడం ఏంటి ఆయనే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి అంటూ ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ram Charan: కూతురి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చరణ్.. నిరాశలో అభిమానులు!

Published

on

Ram Charan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈయన నటుడుగా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఈయన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే నేడు ఫాదర్స్ డే కావడంతో చరణ్ తన కుమార్తె క్లిన్ కారాతో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తన కుమార్తె అందరిని బాగా గుర్తు పడుతుందని చరణ్ తెలిపారు.

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుందని తనని చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ఇక తను కూడా నన్ను చాలా మిస్ అవుతుందని చరణ్ వెల్లడించారు. ఇక నేను షూటింగ్ లేకుండా ఇంట్లో ఉంటే రోజంతా తనతోనే గడుపుతానని తనకు ప్రతిరోజు నేనే తినిపిస్తానని ఆ విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరని తెలిపారు. నేను తినిపిస్తే తన కుమార్తె మొత్తం తింటుందని ఈయన తెలిపారు.

Advertisement

చాలా మిస్ అవుతున్నా..

ఇలాంటి సమయంలో తనని వదిలి షూటింగ్ వెళ్లాలంటే కాస్త బాధగా ఉంటుంది అందుకే తాను స్కూల్ కి వెళ్లే వరకు కూడా షూటింగ్ కంటే ఎక్కువగా తనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Surekha: పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వదిన సురేఖ.. ఈ గిఫ్ట్ ఖరీదు ఎంతో తెలుసా?

Published

on

Surekha: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టి రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇలా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విజయం చూసి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండగలాగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల చూసి తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ ఎంతో గర్వపడుతున్నారు. మరి కొద్ది రోజులలో బాధ్యతలు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్ కు తన వదిన సురేఖ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈయనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. అలాగే ఎన్నో ఫైళ్ళ పై సంతకాలు కూడా పెట్టాల్సి ఉంటుంది అయితే ఆ సంతకాలు అన్ని పెట్టడం కోసం సురేఖ తన మరిది కోసం ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు..

Advertisement

ఇలా సురేఖ తన మరిది కోసం పెన్ గిఫ్ట్ గా ఇస్తున్నటువంటి ఒక వీడియోని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వెంటనే అభిమానులు ఈమె పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి పెన్ ఇచ్చారు. దాని ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలు పెట్టారు.. ఇక పవన్ కోసం సురేఖ ఇచ్చిన పెన్ మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందినది. ఈ పెన్ను ఖరీదు 50వేల రూపాయల నుంచి లక్షల్లో ఉంటాయి.

మూడు లక్షల విలువ..
ఇక పవన్ కళ్యాణ్ కోసం తన వదిన సురేఖ ఇచ్చిన ఈ పెన్ను ఖరీదు ఏకంగా మూడు లక్షల 50 వేల రూపాయలు అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా తన కోసం తల్లి సమానురాలైన సురేఖ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సైతం ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!