Prabhas: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్… ఏమైందంటే?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్ ఈయన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 191.5 కోట్ల కలెక్షన్స్ రాబడినట్లు మేకర్స్ కూడా అధికారకంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరో కూడా సాధించలేని రికార్డ్ ప్రభాస్ తన ఐదు సినిమాలతో సరికొత్త రికార్డు సాధించారని తెలుస్తుంది.

ఇక ప్రభాస్ నటించిన వరుస ఐదు సినిమాలు మొదటి రోజే ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలాంటి రికార్డు ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరో కూడా సాధించలేదని చెప్పాలి. మరి ప్రభాస్ సాధించిన ఆ వంద కోట్ల సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..

ఫస్ట్ డే 100 కోట్లు…
ప్రభాస్ నటించిన బాహుబలి 2 మొదటి రోజు ఏకంగా 217 కోట్ల కలెక్షన్స్ సాధించగా కల్కి 191.5 కోట్ల కలెక్షన్స్ సాధించింది. సలార్ 178 కోట్లు, ఆది పురుష్ 140 కోట్లు, సాహో మొదటిరోజు 130 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడంతో ఇలాంటి అద్భుతమైన అరుదైన ఘనత సాధించిన హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించారు.